దేశీయ స్టాక్ మార్కెట్ సూచీ అయిన నిఫ్టీ గురువారం మునుపటి రోజుకంటే స్వల్పంగా 11 పాయింట్లు పెరిగి 19,822 వద్ద ప్రారంభమయింది. ఉదయం 9:35 గంటల సమయంలో సెన్సెక్స్ 66500 వద్ద ప్రారంభమయి 66437 దగ్గర ట్రేడవుతోంది.
డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.14కు చేరింది. సెన్సెక్స్ 30 సూచీలో టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంక్, ఇండసింద్ బ్యాంక్, టాటా మోటార్స్, మారుతి సుజుకి షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. TCS, టెక్ మహీంద్రా, భారతి ఎయిర్‌టెల్, HCL టెక్నాలజీస్ కంపెనీలు మాత్రం నష్టంలో ఉన్నాయి.
అమెరికా మార్కెట్లు బుధవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. ఐరోపా సూచీలు మాత్రం కొంత నష్టంలోకి జారుకున్నాయి. నేడు ఆసియా-పసిఫిక్ మార్కెట్లు సానుకూలంగా కదలాడుతున్నాయి. ఇజ్రాయెల్ యుద్ధ భయాల నుంచి మార్కెట్లు క్రమంగా కోలుకుంటాన్నాయినే సంకేతాలు ఉన్నాయి. బుధవారం బ్రెంట్ బ్యారెల్ చమురు ధర 85.82 డాలర్లకు చేరింది.
Comments
Please login to add a commentAdd a comment