
ముంబై: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జీరో బ్యాలెన్స్ అకౌంట్ల సర్వీస్ చార్జీల విషయంలో ఐఐటీ-బాంబే ఇటీవల నిర్వహించిన ఓ అధ్యయనం సంచలనంగా మారింది. జీరో బ్యాలెన్స్ అకౌంట్ల నుంచి 2015-2020 మధ్య రూ.300 కోట్లు సర్వీస్ ఛార్జీల రూపంలో బ్యాంకు వసూలు చేసినట్లు ఆ అధ్యయనం ముఖ్య సారాంశం. ఎస్‌బీఐ మాత్రమే కాదు ఇతర బ్యాంకులు కూడా ఇలా సేవల పేరుతో అత్యధికంగా ఛార్జీలు వసూలు చేస్తున్నట్టు ఐఐటీ-బాంబే బాంబు పేల్చింది. సర్వీస్ చార్జీల విషయంపై ఎస్‌బీఐ వివరణ ఇచ్చింది.
జీరో బ్యాలెన్స్ అకౌంట్లు గల ఖాతాదారులు నెలలో నాలుగు ఉచిత లావాదేవీల వినియోగించిన తర్వాత ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు పేర్కొంది. 2016 జూన్ 15 నుంచి ఈ ఛార్జీలు అమల్లోకి వచ్చాయని, ఈ ఛార్జీలపై ఖాతాదారులకు ముందుగానే సమాచారం ఇస్తున్నామని ఎస్‌బీఐ వివరణ ఇచ్చింది. అయితే బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్స్ నెలలో నాలుగు ఉచిత లావాదేవీల తర్వాత ఛార్జీలు వసూలు చేసుకోవచ్చని బ్యాంకులకు 2012 ఆగస్టులో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి ఇచ్చింది. అయితే అదనపు సేవలు పొందే స్వేచ్ఛ కస్టమర్లకు ఉంటుంది కాబట్టి ఉచిత లావాదేవీల తర్వాత ఛార్జీలు చెల్లించాల్సిందే అని పేర్కొంది.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment