హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ రంగంలో ఉన్న టాటా మోటార్స్.. ఎక్స్‌ప్రెస్ బ్రాండ్ కింద ఎలక్ట్రిక్ సెడాన్‌ను రెండు ట్రిమ్స్, నాలుగు వేరియంట్లలో ఆవిష్కరించింది. ట్రిమ్‌నుబట్టి 21.5, 16.5 కిలోవాట్ అవర్ బ్యాటరీ పొందుపరిచారు. సింగిల్ స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్, డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డి్రస్టిబ్యూషన్‌తో ఏబీఎస్ వంటి ఏర్పాటు ఉంది. ఎక్స్‌ప్రెస్–టి 165 మోడల్ ఒకసారి చార్జ్ చేస్తే 165 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది. అలాగే ఎక్స్‌ప్రెస్–టి 213 మోడల్ 213 కిలోమీటర్లు పరుగెడుతుందని వివరించింది. ధర వేరియంట్‌నుబట్టి ఫేమ్–2 సబ్సిడీ పోను రూ. 9.54 లక్షల నుంచి రూ.10.64 లక్షల వరకు ఉంది. ప్రయాణికుల రవాణా, కార్పొరేట్, ప్రభుత్వ సంస్థలను లక్ష్యంగా చేసుకుని ఎక్స్‌ప్రెస్–టి రూపొందించినట్టు కంపెనీ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment