ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో సంచలన నిర్ణయం తీసుకొనుంది. ఆల్ స్టాక్ డీల్‌లో భాగంగా ఆన్‌లైన్ గ్రాసరీ సేవలను అందిస్తోన్న బ్లింకిట్(గ్రోఫర్స్)ను పూర్తిగా హస్తగతం చేసుకునేందుకు జొమాటో సిద్దమైనట్లు తెలుస్తోంది.
చర్చలు సఫలం..!
వీలినం ఒప్పందంపై ఇరు కంపెనీల మధ్య చర్చలు సఫలమైనట్లు తెలుస్తోంది. సాఫ్ట్‌బ్యాంక్-మద్దతు గల క్విక్ కామర్స్ స్టార్ట్-అప్ బ్లింకిట్ ఫుడ్ డెలివరీ యూనికార్న్ జొమాటోతో విలీన ఒప్పందంపై సంతకాలు చేసినట్లు సమాచారం. ఈ డీల్ విలువ సుమారు 700-800 మిలియన్ డాలర్ల మధ్య ఉండనుంది. ఈ డీల్‌తో బ్లింకిట్‌లోని ఇన్వెస్టర్లు జొమాటోలో వాటాలను పొందే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 60 రోజుల వ్యవధిలో డీల్ పూర్తయ్యే అవకాశం ఉంది.
గత ఏడాది జొమాటో నుంచి బ్లింకిట్ భారీ పెట్టుబడులను సేకరించింది. దీంతో బ్లింకిట్ యూనికార్న్ స్టార్టప్‌గా అవతరించింది. 2021 ఆగస్టులో బ్లింకిట్‌లో సుమారు 9.3 శాతం వాటాలను 100 మిలియన్ డాలర్లతో సొంతం చేసుకుంది.
చదవండి: అమెజాన్ బంపరాఫర్..! పలు ఉత్పత్తులపై 60 శాతం తగ్గింపు..!
Comments
Please login to add a commentAdd a comment