చిత్తూరు కార్పొరేషన్: విద్యుత్ బిల్లుల చెల్లింపుల కేంద్రాలను ఆదివారం వినియోగదారుల సౌలభ్యం కోసం అందుబాటులో ఉంచారు. ఈ మేరకు ఉమ్మడి జిల్లాలోని బిల్లు వసూళ్ల కేంద్రాల ద్వారా 14,500 మంది వినియోగదారులు కరెంటు బిల్లులు చెల్లించారు. వీటి ద్వారా రూ.1.30 కోట్లు వసూలైనట్లు తిరుపతి, చిత్తూరు జిల్లాల ఎస్‌ఈలు సురేంద్రనాయుడు, ఇస్మాయిల్‌అహ్మద్ పేర్కొన్నారు. నిర్ణీత గడువులోగా బిల్లులను చెల్లించి సంస్థకు సహకరించాలని అపరాధ రుసుంకు దూరంగా ఉండాలని సూచించారు. హెచ్‌టీ పరిశ్రమదారులు సకాలంలో బిల్లులు కట్టని పక్షంలో జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment