చెన్నై: మద్యం మత్తులో ఎస్సైపై దాడికి పాల్పడిందో యువతి. అసభ్య పదజాలంతో దూషిస్తూ విరుచుకుపడింది. దీంతో స్థానిక పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. తమిళనాడులోని తిరువాణ్మయూర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వివరాలు.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ తోడ్లా శేషు ప్రసాద్ తన స్నేహితురాలు కామినితో కలిసి శనివారం రోజు బయటకు వెళ్లాడు. ఈ క్రమంలో కామరాజార్ నగర్‌లో తనిఖీలు నిర్వహిస్తున్న ఎస్సై మరియప్పన్ వారి కారును ఆపారు. (చదవండి: బెంగాల్‌లో మిస్సింగ్.. హైదరాబాద్‌లో ట్రేసింగ్!)
బ్రీత్ ఎనలైజర్ టెస్టులో శేషు ప్రసాద్(27), కామిని(28) మద్యం సేవించినట్లు తేలడంతో వారిని పోలీసు స్టేషనుకు రావాల్సిందిగా సూచించారు. కారును స్వాధీనం చేసుకున్నారు. దీంతో కోపోద్రిక్తురాలైన కామిని మరియప్పన్‌తో వాగ్వాదానికి దిగింది. ఇష్టారీతిన దూషిస్తూ దాడి చేయగా ఆయన స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో తిరువాణ్మయూర్ పోలీసులు, ఐపీసీ 294(బి)(అభ్యంతరకర భాష ఉపయోగించడం), 323(గాయపరచడం), 353(ప్రభుత్వాధికారిని విధులు నిర్వర్తించుకుండా అడ్డుకోవడం, దాడి చేయడం) తదితర సెక్షన్ల కింద ఆదివారం కేసు నమోదు చేశారు. కాగా కామిని సినీ ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment