
దేవనకొండ: కుమారుడి మరణాన్ని తట్టుకోలేక ఓ తల్లి మృతిచెందింది. ఈ విషాదకర ఘటన ఆదివారం గుండ్లకొండ గ్రామంలో చోటు చేసుకుంది. సంపత్‌కుమారి కుమారుడు సందీప్(25)కు మతిస్థిమితం లేదు. బీపీ, షుగర్ ఎక్కువ కావడంతో వైద్యం కోసం శనివారం కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ కోలుకోలేక శనివారం రాత్రి సందీప్ మృతి చెందాడు. కుమారుడి మరణ వార్తను జీర్ణించుకోలేక కొన్ని గంటల వ్యవధిలోనే తల్లి సంపత్‌కుమారి(48) కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలోనే గుండెపోటుతో తుది శ్వాస విడిచారు.
కాగా మృతురాలి భర్త మూడేళ్ల క్రితం గుండెపోటుతో మృతి చెందాడు. ప్రస్తుతం తల్లీ, కుమారుడు తనువు చాలించడంతో కుటుంబీకులు, బంధుమిత్రులు కన్నీటి పర్యంతమయ్యారు. సంపత్‌కుమారి వైఎస్సార్సీపీ తరఫున గుండ్లకొండ ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేశారు. తల్లీ, కుమారుల మృతి బాధాకరమని వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ గఫూర్, మండలనాయకులు ప్రేమనాథ్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, మదన్‌మోహన్‌రెడ్డి అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment