
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రంగా నకిలీ సర్టిఫికెట్స్ తయారు చేస్తున్న ముఠాను నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. నలుగురు నిందితులు మచ్చేందర్, రాజేష్, సంతోష్, జయంత్‌ల నుంచి పదోతరగతికి చెందిన 13 నకిలీ మెమోలు, ఓ లాప్ టాప్, పోస్టల్ డిపార్ట్ మెంట్‌కు చెందిన నకిలీ పత్రాలు, స్టాంపులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ ముఠా ప్రధాన సూత్రధారి మచ్చేందర్ నుంచి జయంత్ గతంలో నకిలీ సర్టిఫికేట్లు తీసుకున్నాడు. వాటిని ఉపయోగించి జయంత్ పోస్టల్ డిపార్ట్ మెంట్‌లో ఉద్యోగం పొందాడు. కేసు నమోదు చేసి విచారణ నిమిత్తం గాంధీ నగర్ పోలీసులకు నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment