మోసపోయామని ప్రజలు గుర్తించారు | - | Sakshi
Sakshi News home page

మోసపోయామని ప్రజలు గుర్తించారు

Published Fri, Jan 31 2025 2:03 AM | Last Updated on Fri, Jan 31 2025 2:03 AM

మోసపోయామని ప్రజలు గుర్తించారు

మోసపోయామని ప్రజలు గుర్తించారు

మాజీ మంత్రి గొల్లపల్లి

కొడుకు లోకేశ్‌ ప్రమోషన్‌ కోసమే

దావోస్‌ పర్యటన అని విమర్శ

మలికిపురం: చంద్రబాబు వాగ్దానాలు నమ్మి మోసపోయామని ప్రజలు గుర్తించారని మాజీ మంత్రి, రాజోలు వైఎస్సార్‌ సీపీ కోఆర్డినేటరు గొల్లపల్లి సూర్యారావు పేర్కొన్నారు. గురువారం మలికిపురంలో వైఎస్సార్‌ సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికలలో ఇచ్చిన సూపర్‌ సిక్స్‌ హామీలలో ఏ ఒక్కటీ అమలు చేయని చంద్రబాబు ప్రజలను నమ్మించి మోసం చేయడంలో దిట్ట అని ఎద్దేవా చేశారు. మహిళలకు ఉచిత బస్‌ లేదని, గ్యాస్‌ సబ్సిడీ లేదని, నిరుద్యోగ భృతి ఏమైందని ఆయన ప్రశ్నించారు. పెట్టుబడుల కోసం దావోస్‌ వెళ్లి ఏం ఉద్దరించారో ప్రజలకు చెప్పాలన్నారు. పక్క రాష్ట్రం తెలంగాణ రూ.1.60 లక్షల కోట్ల పెట్టుబడులు తెస్తే ఆంధ్రాకు కనీసం దారి ఖర్చులకు సరిపడా పెట్టుబడులు కూడా తేలేదని ఆయన పేర్కొన్నారు. కేవలం కొడుకు లోకేశ్‌ ప్రమోషన్‌ కోసమే చంద్రబాబు దావోస్‌ వెళ్లారని పేర్కొన్నారు. ఈ రోజు కూటమి పాలన చూసి ప్రజలు భయాందోళన చెందుతున్నారని ఆయన అన్నారు. నాయకులు పాటి శివ కుమార్‌, కుసుమ చంద్రశేఖర్‌, కూనపరెడ్డి రాంబాబు, కట్టా శ్రీనివాసరావు, బొలిశెట్టి భగవాన్‌, నల్లి ప్రేమానందం, మోకా సురేష్‌, ఈద రవిరెడ్డి,అడబాల జానకీరామ్‌, తాడి సహదేవ్‌, కారుపర్తి భాస్కరరావు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement