రాష్ట్ర నోడల్ అధికారి తాతబ్బాయి
ముమ్మిడివరం: ఎలక్ట్రానిక్ యంత్రాలు, వీవీ ప్యాడ్ గోదాములకు పటిష్ట భద్రత కల్పించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఉప అదనపు ముఖ్య కార్యనిర్వహక అధికారి, ఈవీఎం రాష్ట్ర నోడల్ అధికారి తాతబ్బాయి ఆదేశించారు. ఎయిమ్స్ ఇంజినీరింగ్ కళాశాలలో ఈవీఎం, వీవీప్యాట్స్ భద్ర పర్చిన గోదాములను జిల్లా రెవెన్యూ అధికారి బీఎల్ ఎన్.రాజకుమారి, వివిధ శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు, వీవీఫ్యాట్ల పటిష్టతకు సంబంధించి చేపడుతున్న ఏర్పాట్లపై రెవెన్యూ, ఎన్నికల, అగ్నిమాపక అధికారులతో సమీక్షించారు. నోడల్ అధికారి తాతబ్బాయి మాట్లాడుతూ ఈవీఎంలు, వీవీప్యాట్లు భద్రపర్చిన గోదాములను ఎన్నికల సంఘం అదేశాల మేరకు ప్రతి నెలా తనిఖీ నిర్వహించి నివేదికను ఎన్నికల సంఘానికి నివేదించాలన్నారు. ప్రతి నెలా అధికారులతోను, ప్రతి మూడునెలలకోసారి రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో గోదాముల తనిఖీలు నిర్వహిస్తామన్నారు. తహసీల్దార్ సుబ్బలక్ష్మి, డిప్యూటీ తహసీల్దార్ శివరాజ్ రామ్మోహనరావు, రెవెన్యూ, అగ్నిమాపక అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment