![ఉద్యమంగా ఎలుకల నిర్మూలన](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/06rvp61-270008_mr-1738866810-0.jpg.webp?itok=BOXPGtK6)
ఉద్యమంగా ఎలుకల నిర్మూలన
కొత్తపేట/రావులపాలెం: పంటలను తీవ్రంగా నష్టపరిచే ఎలుకలను రైతులు సామూహికంగా నిర్మూలించాలని, దీనిని ఒక ఉద్యమంలా చేపట్టాలని జిల్లా వ్యవసాయ అధికారి బి.బోసుబాబు పిలుపునిచ్చారు. ప్రస్తుత రబీ సీజన్‌లో సామూహిక ఎలుకల నిర్మూలనను వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా గురువారం చేపట్టారు. కొత్తపేట వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలోని రావులపాలెం మండలం రావులపాడు గ్రామంలో ఏడీఏ ఎం.వెంకట రామారావు పర్యవేక్షణలో ఆయనతో పాటు వ్యవసాయ కమిషనరేట్ ఆర్టీకే విభాగం డీడీఏ డి.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోసుబాబు రైతులకు సామూహిక ఎలుకల నిర్మూలనపై అవగాహన కల్పించారు. ఇరవై ఐదు కేజీల నూకలను అరకేజీ వంటనూనెతో కలిపి, 500 గ్రాముల బ్రోమోడయొలిన్ మందును కలపాలని సూచించారు. ఆ ఎరను ఎలుకలు తిరిగే బొరియల వద్ద ఉంచి వాటిని నిర్మూలించాలని సూచించారు. ఎరను తయారుచేయించి పొట్లాలుగా కట్టించి రైతులకు పంపిణీ చేశారు. జిల్లా వ్యాప్తంగా ప్రస్తుత రబీలో సుమారు 2.10 లక్షల ఎకరాల విస్తీర్ణంలో వ్యవసాయ, ఉద్యాన పంటలు సాగు చేస్తుండగా ఆయా పంటలను ఎలుకల బారి నుంచి కాపాడేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టామన్నారు. ఇందులో భాగంగా జిల్లాలోని 22 మండలాల పరిధిలో 415 గ్రామాలకు 835 కేజీల బ్రోమోడియొలిన్ మందును ఉచితంగా సరఫరా చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఆత్మ పీడీ జ్యోతిర్మయి, డీఏఏటీటీసీ కోఆర్డినేటర్ నందకిశోర్, మండల వ్యవసాయ అధికారి మీనా తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఆర్టీయే డీడీఏ డి.వెంకటేశ్వర్లు జిల్లా సామూహిక ఎలుకల నిర్మూలన కార్యక్రమానికి సంబంధించి వ్యవసాయ కమిషనరేట్‌కు చెందిన ఆర్టీకే విభాగం డీడీఏ డి వెంకటేశ్వర్లును జిల్లా పరిశీలకునిగా పర్యటించారు.
జిల్లా వ్యవసాయ అధికారి బోసుబాబు
బ్రోమోడయోలిన్ మందు పంపిణీ
Comments
Please login to add a commentAdd a comment