అమలాపురం రూరల్: స్వర్ణాంధ్ర విజన్–2047 డాక్యుమెంట్లో 10 సూత్రాలలో మొదటిది జీరో పావర్టీ లక్ష్యాన్ని సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్టనర్‌షిప్ పీ4 విధానాన్ని రూపొందించిందని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ తెలిపారు. దానికి తగ్గ విధానాలను రూపొందించాలని ఆయన అధికారులను ఆదేశించారు. గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, ఇతర ముఖ్య కార్యదర్శులు 26 జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, పీ4, స్వర్ణాంధ్ర విజయం డాక్యుమెంట్, నియోజకవర్గ విజన్ కార్యాచరణ ప్రణాళిక రూపకల్పన, ఎంఎస్‌ఎంఈ సర్వే కాలుష్య నియంత్రణ, సమగ్ర బయో గ్యాస్ ప్లాంట్ల ఏర్పాటు భూసేకరణ అంశాలపై జిల్లా కలెక్టర్లకు దిశా నిర్దేశం చేశారు. దీని ద్వారా పేదరికంలో ఉన్న 20 శాతం మందిని గుర్తించేందుకు చట్టబద్ధమైన సర్వేను మార్చి 10 నుంచి నిర్వహించాలన్నారు. అనంతరం కలెక్టర్ జిల్లా స్థాయి అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ సమాజంలో ఆర్థిక అసమానతలు తగ్గించి ప్రతి ఒక్కరి జీవన ప్రమాణాలు పెంచేందుకు జన్మభూమి స్ఫూర్తితో పీ 4 విధానాన్ని తీసుకు వచ్చిందన్నారు. ఆన్‌లైన్ సర్వేలో పంచాయతీరాజ్, మున్సిపల్ సచివాలయం ఉద్యోగులు పాల్గొనాలని సూచించారు. పేదలకు వైద్యం, మరుగుదొడ్లు, సోలార్, విద్యుత్, రోడ్డు మార్గాలు వంటి వసతులు చేకూర్చాలన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్‌ఎంఈ పార్క్ ఒకటి నెలకొల్పేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఓ వెంకటేశ్వర్లు జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
10న జాతీయ నులిపురుగు నిర్మూలన దినం
ఈ నెల పదో తేదీన నిర్వహించిన జాతీయ నులిపురుగు నిర్మూలనా దినోత్సవం విజయవంతం చేయాలని కలెక్టర్ మహేష్ కుమార్ అధికారులకు సూచించారు. వైద్య ఆరోగ్య అధికారులతో ఆయన కాన్ఫెరెన్స్ నిర్వహించి పలు సూచనలు ఇచ్చారు. అన్ని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, కాలేజీలు, ప్రైవేట్ స్కూళ్లలో ఒకటి నుండి 19 సంవత్సరాల పిల్లలకు ఆల్బెండాజోల్ 400 ఎంజీ మాత్రాలు మ్రింగించాలన్నారు. 1 నుంచి రెండేళ్లలోపు పిల్లలుకు సగం మాత్ర, 2 నుండి 19 ఏళ్ల లోపు పిల్లలకు పూర్తి మాత్ర వేయాలన్నారు.
అధికారులకు కలెక్టర్ ఆదేశం
Comments
Please login to add a commentAdd a comment