![జాతీయ క్రీడలకు గుడిమెళ్లంక విద్యార్థిని](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/06rzl21-270020_mr-1738866810-0.jpg.webp?itok=ph9NQBGy)
జాతీయ క్రీడలకు గుడిమెళ్లంక విద్యార్థిని
మలికిపురం: ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కఠిమ నియోజకవర్గంలో ఈ నెల 14వ తేదీ నుంచి జరిగే 38వ జాతీయ క్రీడలకు, మల్లాకంభ (రోప్‌తో విన్యాసాలు) క్రీడకు గుడిమెళ్లంక పాఠశాల విద్యార్థిని కర్రి దేవి ఎంపికై నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పుట్ట సత్య వెంకట సుబ్బారావు గురువారం తెలియజేశారు. గత నెల భీమవరంలో జరిగిన నేషనల్ గేమ్స్ ఎంపికలలో విశేష ప్రతిభ కనబరిచి జాతీయ క్రీడలకు ఎంపికై నట్లు వ్యాయామ ఉపాధ్యాయులు బి.రాధాకష్ణ తెలియజేశారు. దేవికి ఎంఈఓ ముంగండ విజయశ్రీ స్వీట్లు తినిపించి అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment