![భక్తుల రద్దీకి అనుగుణంగా సౌకర్యాలు](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/01/31/30rzl44-270021_mr-1738268621-0.jpg.webp?itok=35Vjz3TB)
భక్తుల రద్దీకి అనుగుణంగా సౌకర్యాలు
అంతర్వేది లక్షీనరసింహస్వామి
కల్యాణోత్సవాలపై కలెక్టర్ సమీక్ష
సఖినేటిపల్లి: అంతర్వేది క్షేత్రంలో వచ్చే నెల 4వ తేదీ నుంచి 13వ తేదీ వరకూ పది రోజుల పాటు జరిగే లక్షీనరసింహస్వామివారి వార్షిక దివ్య తిరు కల్యాణ మహోత్సవాల్లో భక్తుల రద్దీకి అనుగుణంగా సౌకర్యా లు చేపట్టాలని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ అధికారులను ఆదేశించారు. ఏరోజుకారోజుతో పాటు ప్రధానమైన రోజులలో కూడా ముందస్తుగా భక్తుల రద్దీని అంచనా వేసుకోవాలని సూచించారు. గురువారం అంతర్వేది ఆలయ ప్రాంగణంలో స్వామి కల్యాణ మహోత్సవాల ఏర్పాట్లు పురోగతిపై కలెక్టర్ వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. ఆల యం వెలుపల, లోపల భక్తుల క్యూ లు, తాగునీటి వసతి, భక్తుల భద్రతకు సీసీ కెమెరాలు గురించి ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వి.సత్యనారాయణ, కలెక్టర్‌కు వివరించారు. తీర్థంలో శానిటేషన్, పా ర్కింగ్ స్థలాల ఏర్పాటు గురించి పురోగతిని డీపీవో వివరించారు. గుర్రాలక్క గుడి వద్ద, ఇతర చోట్ల ఎని మిది పార్కింగ్ స్థలాలు ఎంపిక చేశామన్నారు. భక్తుల సౌకర్యార్థం ఆయా మార్గాలు, ప్రసాదం కౌంటర్లు, పార్కింగ్ స్థలాల గురించి సూచించే సైనింగ్ బోర్డులు ఏర్పాటు చేయాలని పంచాయతీరాజ్ అధికారులకు సూచించారు. కల్యాణ వేదిక వద్ద సాధారణ భక్తులు, వీఐపీ గ్యాలరీల గురించి పర్యవేక్షణ అధికారి అమలాపురం ఆర్డీవో రె.మాధవి, పౌర్ణమి రోజున స్నానఘట్టాల వద్ద భద్రతా ఏర్పాట్లు, బీచ్‌లో జల్లు స్నానం గురించి పర్యవేక్షణ అధికారి, రామచంద్రపురం ఆర్డీవో అఖిల కలెక్టర్‌కు వివరించారు. రథయాత్ర సాగే మార్గంలో భక్తుల రద్దీకి తగ్గట్టుగా తీసుకుంటున్న చర్యలను డ్వామా పీడీ మధుసూదన్ వివరించారు. తీర్థంలో ప్రాథమిక వైద్య శిబిరాలతోపాటు, అత్యవసర సేవలకు ఏర్పాట్లు చేస్తున్నట్టు డీఎంహెచ్‌ఓ దుర్గారావు దొర తెలిపారు. భక్తులకు 120 తాత్కాలిక మొబైల్ టాయిలెట్స్, 20 డ్రింకింగ్ వాటర్ స్టాల్స్, సత్రాలకు 15 ట్యాంకర్స్ ద్వారా నీటి సరఫరాకు చర్యలు తీసుకుంటున్నట్టు ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు, కలెక్టర్ దృష్టికి తెచ్చారు. అమలాపురం డీఎస్పీ ప్రసాద్ మా ట్లాడుతూ, భక్తులకు లడ్డు ప్రసాదం కౌంటర్ కొప నాతి కృష్ణమ్మ విగ్రహం ఏరియాలో ఏర్పాటుకు, తీర్థంలో అన్నిచోట్లా డ్రోన్స్ తిరగనున్న నేపథ్యంలో బీచ్‌లో దుస్తులు మార్చుకునే గదులు పైన కూడా మూసివేసేటట్టు చూడాలని కలెక్టర్‌కు కోరారు. కాగా భక్తుల భద్రతకు మైరెన్, పోలీసు, ఎండోమెంట్స్ శా ఖలు సంయుక్తంగా నిర్వహించే కమాండ్ కంట్రోల్ రూంకు ఆయా ఏరియాలలోని మొత్తం సీసీ కెమెరా లు కనెక్ట్ అయ్యేలా చూసుకోవాలని, బీచ్‌లో కూడా మొదటిసారిగా ఏర్పాటు చేయబోయే ఈ వ్యవస్థ కూడా అనుసంధానం కావాలని కలెక్టర్, ఆయా అధికారులకు ప్రత్యేక సూచనలు చేశారు. ఎండోమెంట్స్ డీసీ డీఎల్‌వీ రమేష్‌బాబు, తహసీల్దారు ఎం.వెంకటేశ్వరరావు, డీటీ భాస్కర్, ఉత్సవ సేవా కమిటీ చైర్మన్ బాలాజీ, ఎంపీపీ వీరా మల్లిబాబు, సర్పంచ్ కొండా జాన్‌బాబు, ఎంపీటీసీ సభ్యుడు బైరా నాగరాజు పాల్గొన్నారు. అంతకుముందు కలెక్టర్ లక్ష్మీనృసింహ స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. కలెక్టర్‌కు అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు.
Comments
Please login to add a commentAdd a comment