ఏకత్వ భావనే ఎన్‌సీసీ లక్ష్యం
ఎయిర్ కమోడోర్ విఎం రెడ్డి
రాజానగరం: జాతీయ సమైక్యత, సాంస్కృతిక వారసత్వం, సంప్రదాయాలపై అవగాహన పెంచుకోవడంతో పాటు దేశ నిర్మాణంలో ఏకత్వ భావన దిశగా స్ఫూర్తిని కలిగించేలా ఎన్‌సీసీ కార్యక్రమాలు ఉంటాయని ఉభయ తెలుగు రాష్ట్రాల (సికింద్రాబాద్) ఎన్‌సీసీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్, ఎయిర్ కమోడోర్ వీఎం రెడ్డిఅన్నారు. స్థానిక గైట్ కళాశాలలో ఈ నెల 2 నుంచి జరుగుతున్న ప్రత్యేక జాతీయ సమగ్రత శిబిరాన్ని శనివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ దేశంలోని 29 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన 17 ఎన్‌సీసీ డీటీల నుంచి ప్రత్యేకంగా ఎంపిక చేసిన 300 మంది సీనియర్ ఎన్‌సీసీ క్యాడెట్లు పాల్గొంటున్న ఈ శిబిరం 13వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. యువ ఎన్‌సీసీ క్యాడెట్లను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నామన్నారు. రాబోయే కాలంలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఎన్‌సీసీ అకాడమీల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. ఏపీలోని వెలగపూడి ప్రత్యేక ఎన్‌సీసీ డైరెక్టరేట్ కోసం ప్రణాళికను సిద్ధం చేశామన్నారు. సాయంత్రం ఎన్‌సీసీ క్యాడెట్లు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో రితిన్ మోహన్ అగర్వాల్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment