ఎన్డీయే కూటమి విఫలం కాక తప్పదు
డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ విశ్వేశ్వర రెడ్డి
రాజమహేంద్రవరం సిటీ: అమలుకాని హామీలతో గద్దెనెక్కిన ఎన్డీయే కూటమి ప్రభుత్వం అదే ప్రజల వ్యతిరేకతతో విఫలం కాక తప్పదని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ టీకే విశ్వేశ్వర రెడ్డి ధ్వజమెత్తారు.శనివారం నగరంలో స్థానిక మున్సిపల్ కాలనీలో జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సూపర్ సిక్స్ పథకాలు వాస్తవంలో అమలు కావడం లేదని ఆరోపించారు. సీ్త్ర శక్తి, అమ్మఒడి, రైతులకు రూ.20 వేలు సహాయం, వంటివి అమలు చేయడం లేదని ఆక్షేపించారు. చంద్రబాబు అమరావతి అభివృద్ధికి తెచ్చిన 15 వేల కోట్లు అప్పు మాత్రమే నని చెప్పారు. తిరుమల ప్రసాదం కల్తీ విషయాన్ని పవన్ కల్యాణ్ రాజకీయం చేస్తూ సినిమా వేషాలు వేస్తున్నారని ధ్వజమెత్తారు. పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆదేశాల మేరకు జిల్లా కమిటీని పూర్తి స్థాయిలో నియమిస్తున్నట్లు ఆయన తెలిపారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment