చట్టాలపై మహిళలకు అవగాహన అవసరం
రాజమహేంద్రవరం రూరల్: ప్రతి మహిళ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కె.ప్రకాష్‌బాబు అన్నారు. బుధవారం బొమ్మూరులోని మహిళా ప్రాంగణం ఆవరణలో జాతీయ మహిళా కమిషన్, జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో విధాన్‌సే సమాధాన్ మహిళా న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా పాల్గొన్న ప్రకాష్‌బాబు మాట్లాడుతూ మహిళలు ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కోవాలన్నారు. గృహహింస చట్టం, వరకట్న వేధింపులు, తదితర చట్టాలపై అవగాహన కల్పించారు. రాజానగరం ఐసీడీఎస్ సీడీపీవో నాగమణి, న్యాయవాదులు బి.పద్మావతి, వి.సుజాత మహిళా చట్టాల గురించి వివరించారు. ధవళేశ్వరం పోలీస్‌స్టేషన్ ఎస్సై వి.క్రాంతికుమార్, ఏసీడీపీవో కనకవల్లి, మహిళలు పాల్గొన్నారు.
న్యాయం చేయండి సారూ...
తన పెద్ద కుమారుడు హత్యకు గురయ్యాడని, చిన్న కుమారుడు అదే ఘటనలో తీవ్రంగా గాయపడి ప్రాణాలతో బయటపడ్డాడని తమ కుటుంబానికి న్యాయం చేయాలని బొమ్మూరు జేఎల్‌బీనగర్‌కు చెందిన సత్యవతి జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.ప్రకాష్‌బాబును కోరింది. బొమ్మూరు మహిళా ప్రాంగణంలో ఆయనను కలిసి తమ గోడును వెళ్లబోసుకుంది. వస్త్ర వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నానని తెలిపింది. తన చిన్న కుమారుడుకి ఉద్యోగం ఇప్పించి, ప్రభుత్వం తరఫున సాయం అందించేలా చూడాలని కోరింది.
జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి,
సీనియర్ సివిల్‌జడ్జి ప్రకాష్‌బాబు
Comments
Please login to add a commentAdd a comment