రాష్ట్రపతికి లేఖలు రాసిన అంగన్‌వాడీలు
నల్లజర్ల: అంగన్‌వాడీ కార్యకర్తలను గ్రేడ్–3, ఆయాలను గ్రేడ్–4 ప్రభుత్వ ఉద్యోగులుగా క్రమబద్ధీకరించాలని కోరుతూ భారత రాష్ట్రపతికి అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు లేఖలు రాశారు. ఈ సందర్భంగా సంఘ అధ్యక్షురాలు శివకుమారి బుధవారం విలేకరులతో మాట్లాడుతూ బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహారం అందించే లక్ష్యంతో ఐసీడీఎస్ ఏర్పాటై 50 సంవత్సరాలు పూర్తయిందన్నారు. ఐసీడీఎస్‌ను క్రమబద్ధీకరించాలని, బడ్జెట్‌లో కేటాయింపులు పెంచాలని కోరారు. ఈ విషయమై గుజరాత్ హైకోర్టుతోపాటు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని అంగన్‌వాడీ వర్కర్లు రాష్ట్రపతి ద్రౌపదిముర్ముకు లేఖలు రాసినట్టు వివరించారు. మండలంలోని నల్లజర్ల, దూబచర్ల, అనంతపల్లి, పోతవరం సెక్టార్లలోని 85 కార్యకర్తలు, ఆయాలు సమావేశం నిర్వహించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. దశాబ్ధాలుగా సేవలు అందిస్తున్న వర్కర్స్, ఆయాలకు7వ పేకమిషన్ సిఫారసులకు అనుగుణంగా కనీస వేతనం రూ.26వేలు, సుప్రీంకోర్టు గైడ్‌లెన్స్ ప్రకారం వడ్డీతో సహ గ్రాడ్యూటీ చెల్లించేలా చూడాలని ఆ వినతి పత్రంలో పేర్కొన్నారు. ఝూన్సీరాణి, విమలబాయి, రాజ్యలక్ష్మి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment