శ్రీవారి తెప్పోత్సవానికి సర్వం సిద్ధం
నేడు పుష్కరిణిలో వైభవంగా వేడుక
ద్వారకాతిరుమల: శ్రీవారి పుష్కరిణి (నృసింహ సాగరం)లో బుధవారం రాత్రి జరగనున్న చినవెంకన్న తెప్పోత్సవానికి సర్వం సిద్ధమైంది. వేడుకలో భాగంగా ఉభయ దేవేరులతో స్వామివారు విహరించనున్న తెప్పను హంస వాహనంగా అలంకరిస్తున్నారు. తెప్పలో పచ్చిపూల మండపాన్ని నిర్మిస్తున్నారు. భక్తులకు రక్షణ కల్పించేలా పుష్కరిణి గట్లపై బారికేడ్లు నిర్మించారు. సాగరం మధ్యలోని మండపానికి, గట్లపైన, చెట్లకు విద్యుద్దీప అలంకారాలు చేశారు. దాంతో పుష్కరిణి పరిసరాలు మిరుమిట్లు గొలుపుతున్నాయి. పుష్కరిణి ముందు ఏర్పాటు చేసిన స్వామివారి భారీ విద్యుత్ కటౌట్ కనువిందు చేస్తోంది. స్వామి, అమ్మవార్లు ఆలయం నుంచి తొళక్క వాహనంపై బయల్దేరి పుష్కరిణి వద్దకు రాత్రి 8 గంటల సమయానికి చేరుకుంటారని, ఆ తరువాత తెప్పోత్సవం ప్రారంభమవుతుందని ఆలయ ఈఓ ఎన్‌వీఎస్‌ఎన్ మూర్తి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment