
విజయవాడ పీడబ్ల్యూడీ గ్రౌండ్స్‌లో అంబేడ్కర్ స్మృతి వనం 2023 ఏప్రిల్ 14 కల్లా పూర్తిచేస్తామని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖామా త్యులు మేరుగ నాగార్జున ప్రక టించారు. డాక్టర్ బీఆర్ అంబే డ్కర్ 132వ జయంత్యోత్స వాల సందర్భంగా, ఈ స్మృతివనం రూపకల్పన పూర్తయితే ఆంధ్రప్రదేశ్‌కు ఒక చారిత్రక, సామాజిక, సాంస్కృతికమైన గుర్తింపు వస్తుంది. ఈ 125 అడుగుల విగ్రహం పూర్తయిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా బుద్ధుడు, అంబేడ్కర్ అభిమానులంతా పర్యాటకులుగా వస్తారు. దానివల్ల ప్రపంచ కీర్తి ఆంధ్రప్రదేశ్‌కు వస్తుంది.
అంబేడ్కర్ లైబ్రరీని ఈ స్మృతివనంలో నిర్మిం చడం వల్ల ఆయన గ్రంథాలు, ఆయనపై రాసిన గ్రంథాలు, ఆయన పరిశోధించిన గ్రంథాలు... పరిశో ధకులకు, పాఠకులకు లభ్యమవుతాయి. అంబే డ్కర్ రచనల ముద్రణాలయం నిర్మించడం వల్ల అంబేడ్కర్ సాహిత్యం నిరంతరంగా ప్రచురితమై ప్రాథమిక స్కూళ్లకు, హైస్కూళ్లకు, కాలేజీలకు, విశ్వ విద్యాల యాలకు చేరి... విద్యార్థులలో అంబేడ్కర్ మీద అవగాహన పెరిగి లౌకికవాద భావజాలం, కుల నిర్మూలనా సిద్ధాంతం విస్తృతమౌతుంది.
అంబేడ్కర్ స్మృతివనంలో ఆయన విగ్రహంతో పాటు మహాత్మా ఫూలే, పెరియార్ రామస్వామి నాయకర్, నారాయణ గురు, సంత్ రవిదాస్, సాహూ మహరాజ్, జిలకరీ బాయి, రమాబాయి, భీమా బాయి, రాంజీ సత్పాల్, సావిత్రీ బాయి ఫూలే వంటివారి విగ్రహాలు నిలపడం ద్వారా సాంస్కృతిక విప్లవ యోధుల జీవన గాథలు స్మృతి పథంలోకి వస్తాయి. అంబేడ్కర్ రీసెర్చ్ సెంటర్‌ను స్మృతి వనంలో రూపొందించడం వల్ల ఎందరో పరిశోధ కులు దేశ, విదేశాల వాళ్ళు స్మృతివనంలో చదువుకునే అవకాశం ఉంటుంది. అంబేడ్కర్ స్మృతి వనం రూపొందే సమయంలో ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ చంద్రబాబు కాలంలో ఎంతో పోరాటం చేసింది. అది ఇప్పటికి సాకారమైంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కనీసం దానికి 500 కోట్ల రూపా యలు కేటాయి స్తేనేగానీ అందులో ఈ ప్రతిపాదించిన అంశాలన్నీ రూపొందవు! ఇప్పటికి 200 కోట్లు కేటాయించినట్లు తెలుస్తున్నది. ఈ నిర్మాణం విస్తృతం చేయాల్సిన అవసరం ఉంది. దీని రూపకల్పనలో ప్రత్యేక అధి కారిని కూడా ప్రకటించాల్సిన అవసరం ఉంది.
ఆగ్రాలోని తాజ్‌మహల్‌కూ, ఇప్పుడు అయోధ్యలో నిర్మిస్తున్న రామాలయానికీ ప్రత్యా మ్నాయ భావజాలం అంబేడ్కర్ స్మృతి నిర్మాణం లోనూ, వివిధ ప్రదేశాలలోని అంబేడ్కర్ పార్కు ల్లోనూ ఉంటుంది. చైనా, జర్మనీ, ఫ్రాన్స్ వంటి ఎన్నో ఇతర దేశాలవారు తమ తమ భాషల్లో అంబేడ్కర్ రచనల్ని అనువదింపజేసుకుని అంబేడ్కర్ భావాల్ని తమ దేశాల పాలనలో అన్వయించుకుంటున్నారు.
అంబేడ్కర్ స్మృతివనం ఆంధ్ర దేశానికే కాక భారతదేశానికే ఒక మణిదీపం అవుతుంది. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఈ నిర్మాణాన్ని చేపట్టడం హర్ష ణీయం. అశోకుడు బౌద్ధ స్థూప నిర్మాణాల ద్వారా చరిత్రకు ఊతమిచ్చినట్టే... భారతదేశ చరిత్రకు ఈ స్మృతి వనం ఒక చారిత్రక సింబల్ కావడం చారిత్రక సత్యం. పార్టీలకూ, భావజాలాలకూ అతీతంగా ఈ స్మృతివనాన్ని ప్రోత్సహించడం అందరి బాధ్యత. కాశీ నుంచి కన్యాకుమారి వరకూ అంబేడ్కర్ విగ్రహాల స్ఫూర్తి, చైతన్యం భారతదేశానికి దిక్సూచిగా ఉంది. పార్లమెంట్‌లో ఆయన చిత్రపటం, పార్లమెంట్ ఎదురుగా ఆయన నిలువెత్తు స్ఫూర్తివంతమైన విగ్రహం రాజ్యాంగ నీతిని నిరం తరంగా గుర్తు చేస్తుంది. ఈ స్మృతి వన నిర్మాణంలో మనమందరం భాగస్వాములమవుదాం. చరిత్రలో ఏ నిర్మాణమైనా జరిగింది ప్రేమ, కరుణ, ప్రజ్ఞలతోనే!
వ్యాసకర్త: డా. కత్తి పద్మారావు
దళితోద్యమ నిర్మాత
మొబైల్: 98497 41695
Comments
Please login to add a commentAdd a comment