ప్రజా సమస్యల పరిష్కారమే ప్రథమ కర్తవ్యం
గుంటూరు వెస్ట్: ప్రజా సమస్యల పరిష్కారమే మన ప్రథమ కర్తవ్యమని కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి పేర్కొన్నారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ పెండింగ్ అర్జీలపై ప్రతివారం సమీక్షించి పరిష్కారానికి కృషి చేయాలని చెప్పారు. అర్జీదారులను పదేపదే తిప్పుకోవద్దని సూచించారు. నిర్లక్ష్యంగా ఉంటే మెమోలు జారీ చేస్తామని హెచ్చరించారు. అనంతరం వచ్చిన 187 ఫిర్యాదులను కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ, డీఆర్వో ఖాజావలి, ఆర్డీఓ కె.శ్రీనివాసరావు, స్పెషల్ డెప్యూటీ కలెక్టర్లు ఎం.గంగ రాజు, లక్ష్మీ కుమారి, జిల్లా అధికారులు పరిశీలించారు.
కలెక్టర్ నాగలక్ష్మి గ్రీవెన్స్‌లో అర్జీల స్వీకరణ
Comments
Please login to add a commentAdd a comment