కళలకు ప్రభుత్వ ప్రోత్సాహం కీలకం
నగరంపాలెం: రాష్ట్రంలో కళలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పద్మశ్రీ పురస్కారగ్రహీత సి.వి.రాజు అన్నారు. డాక్టర్ పట్టాభి కళాపీఠం 14వ వార్షికోత్సవ సభ బ్రాడిపేట 2/7వ అడ్డరోడ్డులోని సీపీఎం జిల్లా కార్యాలయ ఆవరణలోని సమావేశ మందిరంలో ఆదివారం నిర్వహించారు. కళాపీఠం వ్యవస్థాపకులు డాక్టర్ తూములూరి రాజేంద్రప్రసాద్ అధ్యక్షత వహించి, మాట్లాడారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన సి.వి.రాజు మాట్లాడుతూ కళలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. విశిష్ట అతిథి డాక్టర్ సమరం మాట్లాడుతూ కళలు అజరామరమని అన్నారు. కళాకారులను ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. చింతామణి పాత్ర పోషిస్తున్న జి.రత్నశ్రీ (రంగస్థలం) మాట్లాడుతూ నాటకాలు విజ్ఙానానికి కూడా నిదర్శనమని పేర్కొన్నారు. అనంతరం ఎ.మానస (నాట్యం), డాక్టర్ ఎల్.వరలక్ష్మి (పర్యావరణం), డాక్టర్ జి.సమరం, డాక్టర్ బి.అంజయ్య (వైద్యం), జి.రత్నశ్రీ (రంగస్థలం), డాక్టర్ కేవీ అనంతశయనం(సంగీతం), డాక్టర్ వజ్రగిరి జస్టిస్ (చిత్రలేఖనం), డాక్టర్ ఎంబీడీ శ్యామల (కవిత్వం), డాక్టర్ సీహెచ్ స్వరాజ్యాలక్ష్మి (విద్య)లకు పట్టాభి అవార్డులు, డాక్టర్ ఝాన్సీలక్ష్మీకి సీ్త్రశక్తి అవార్డు ప్రదానం చేశారు. అనంతరం శ్రీసాయి మంజీర కూచిపూడి నృత్య అకాడమీ విద్యార్థినుల నృత్య ప్రదర్శన, మరియదాసు పాటల రికార్డింగ్ డాన్స్, కృష్ణ ఫ్లూట్‌పైలాలపించిన గీతాలు అలరించాయి. డాక్టర్ జగత్‌శ్రీనివాస్, డాక్టర్ ఎస్‌బీఎస్ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment