సోమవారం శ్రీ 25 శ్రీ నవంబర్ శ్రీ 2024
ఇబ్బందులు పరిష్కరిస్తేనే...
స్మార్ట్ మీటర్లతో అనవసరపు విద్యుత్ వినియోగం తగ్గుతుంది. గ్రామీణ ప్రాంత వినియోగదారులు అవస్థలు పడే అవకాశాలున్నాయి. విద్యుత్తు సంస్థకు మొండి బకాయిల బెడద తప్పుతుంది. ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాలు ఇకపై అధిక బకాయిలు పెండింగ్‌లో ఉంచే అవకాశం ఉండదు. లైన్ల నుంచి విద్యుత్‌ను అక్రమంగా వాడుకునే వారి సంఖ్య పెరిగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. విద్యుత్ మీటర్ రీడర్లపై పడనుంది. గుంటూరు నగరంలో సుమారు 100 మంది రీడర్స్ పనిచేస్తున్నారు. వారి ఉపాధికి గండి పడనుంది.
విద్యుత్ చార్జీల చెల్లింపు విధానం ప్రీపెయిడ్‌లోకి మారనుంది. ఇక ముందస్తుగా రీచార్జి చేసుకుంటేనే విద్యుత్ సరఫరా ఉంటుంది. బ్యాలెన్స్ అయిపోగానే సరఫరా ఆటోమేటిక్‌గా నిలిచిపోతుంది. ఆ దిశగా ప్రస్తుతం ఉన్న విద్యుత్ మీటర్ల స్థానంలో స్మార్ట్ మీటర్లను విద్యుత్ శాఖ తీసుకొస్తోంది. ఇప్పటికే గుంటూరు నగరంలో అందుబాటులోకి వచ్చేశాయి. తొలి విడతగా వీటిని ప్రభుత్వ కార్యాలయాలు, కమర్షియల్, పరిశ్రమల్లో ఏర్పాటు చేస్తున్నారు.
న్యూస్‌రీల్
Comments
Please login to add a commentAdd a comment