No Headline | - | Sakshi
Sakshi News home page

No Headline

Published Mon, Nov 25 2024 7:56 AM | Last Updated on Mon, Nov 25 2024 7:55 AM

No He

No Headline

దర్శనం కోసం క్యూలైన్లలో భక్తులు

పెదకాకాని: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పెదకాకాని శ్రీ భ్రమరాంబ మల్లేశ్వరస్వామి వారి దేవస్థానం కార్తిక మాసం సందర్భంగా వచ్చిన భక్తులతో హరోం హర నామస్మరణతో మార్మోగింది. పెదకాకాని శివాలయంలో తెల్లవారుజామున సుప్రభాతసేవతో పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. వేకువజామున భక్తులు యజ్ఞాల బావి వద్ద స్నానాలు చేసి, ప్రదక్షిణలు చేశారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులతో ప్రాంగణం కళకళలాడింది. తర్వాత కార్తికదీపాలు వెలిగించి భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. యజ్ఞాల బావి నీటితో పొంగళ్లు పొంగించి స్వామివారికి నైవేద్యం సమర్పించారు. మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు అసౌకర్యం కలుగకుండా ఆలయ డిప్యూటీ కమిషనర్‌ కె.బి. శ్రీనివాస్‌ ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. క్యూలైన్లలలో భక్తులకు దాతల సహకారంతో పాలు, మజ్జిగ, తాగునీరు అందించారు. అంతరాలయ దర్శనాలు, అభిషేకాలు, ఏకవారాభిషేక పూజలు, అన్నప్రాసనలు, నామకరణలు, రాహుకేతు పూజలు అధికసంఖ్యలో జరిగాయి. ప్రభలతో ఆలయానికి చేరుకున్న భక్తులు ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఒక్కరోజులో స్వామి వారికి రూ.7,25,000 ఆదాయం లభించినట్లు శ్రీనివాస్‌ తెలిపారు. అమ్మవారికి భక్తులు సమర్పించి చీరల వేలంపాట ద్వారా రూ.1,02,350 ఆదాయం చేకూరినట్లు ఆలయ ఉప కకమిషనర్‌ తెలిపారు.

హరోం హర... !

భక్తులతో కిటకిటలాడిన కాకాని శివాలయం కార్తిక దీపాలు వెలిగించి పూజలు చేసిన భక్తులు

No comments yet. Be the first to comment!
Add a comment
No Headline1
1/1

No Headline

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement