No Headline
కొరిటెపాడు(గుంటూరు): గత నెల రోజుల వ్యవధిలో నగరంలోని ప్రభుత్వ కార్యాలయాలు, కమర్షియల్, పరిశ్రమల్లో ప్రయోగాత్మకంగా 6,500 స్మార్ట్ మీటర్లను అమర్చి వాటి పనితీరును పరిశీలిస్తున్నారు. రెండో విడతగా అన్ని చోట్ల వీటిని బిగించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఆ తర్వాత గృహ సముదాయాలు, వ్యవసాయానికి కూడా ఏర్పాటు చేయనున్నారు. గుంటూరు నగరంలో 3.53 లక్షల గృహ, 53 వేల కమర్షియల్, 1,485 పరిశ్రమలకు సంబంధించిన విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ నెల వినియోగించిన విద్యుత్‌కు సంబంధించి వినియోగదారులు మరుసటి నెలలో బిల్లు చెల్లిస్తున్నారు. ప్రతి నెలా మొదటి వారంలో మీటరు రీడర్ బిల్లు తీస్తే చెల్లించేందుకు పదిహేను రోజుల పాటు గడువు ఉంటుంది. ఆ తర్వాత కూడా అపరాధ రుసుంతో చెల్లించేందుకు అవకాశం కల్పిస్తారు. ఈ విధానంలో బకాయిలు రూ.కోట్లలో పేరుకుపోయి విద్యుత్ పంపిణీ సంస్థలపై భారం పడుతోంది.
బ్యాలెన్స్ ఉంటేనే సరఫరా
దీని నుంచి ఉపశమనానికి కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా దశల వారీగా స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు విద్యుత్ సంస్థ సిద్ధమవుతోంది. స్మార్ట్ మీటర్ల విధానంలో వినియోగదారులు ముందుగా రీచార్జి చేసుకోవాల్సి ఉంటుంది. బ్యాలెన్స్ ఉన్నంత వరకు నిర్విరామంగా విద్యుత్ సరఫరా అవుతుంది. ఈ విధానంలో ఎంత విద్యుత్ వినియోగించామో, ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందో ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ప్రత్యేకంగా యాప్‌ను తీసుకురానున్నారు. ఈ యాప్ వినియోగదారులు తమ మొబైల్ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకుని పరిశీలించుకోవచ్చు. నగదు అయిపోయిన వెంటనే మళ్లీ రీచార్జి చేసుకుంటే విద్యుత్ సరఫరా కొనసాగుతుంది. గతంలోలా గడువు లేక వినియోగదారులు ఇబ్బందులు పడే అవకాశం ఉందని పలువురు పేర్కొంటున్నారు.
బిల్లుల స్థానంలో ప్రీపెయిడ్ విధానం స్మార్ట్ మీటర్లకు విద్యుత్ సంస్థ చర్యలు తొలుత ప్రభుత్వ కార్యాలయాలు, కమర్షియల్, పరిశ్రమల్లో ఏర్పాటు ఇప్పటికే గుంటూరులో సుమారు 6,500 వరకు బిగింపు
లోపాలు లేకుండా బిగించేలా చర్యలు
ప్రస్తుతం ఉన్న మీటర్ల స్థానంలో స్మార్ట్ మీటర్లను విద్యుత్ శాఖ తీసుకొస్తోంది. తొలుత నగరంలోని పలు ప్రభుత్వ కార్యాలయాలు, కమర్షియల్, పరిశ్రమల్లో ప్రయోగాత్మకంగా అమర్చాం. ప్రస్తుతం పనితీరు పరిశీలిస్తున్నాం. లోపాలు ఉంటే సరిచేసి, మిగిలిన వాటికీ అమర్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
–టి.శ్రీనివాసబాబు, డీఈ,
విద్యుత్ శాఖ, గుంటూరు
Comments
Please login to add a commentAdd a comment