‘నాట్కొ’న్న వైద్య బంధం | - | Sakshi
Sakshi News home page

‘నాట్కొ’న్న వైద్య బంధం

Published Wed, Jan 29 2025 1:27 AM | Last Updated on Wed, Jan 29 2025 1:27 AM

‘నాట్కొ’న్న వైద్య బంధం

‘నాట్కొ’న్న వైద్య బంధం

గుంటూరు మెడికల్‌: పేద రోగులకు నాట్కో ట్రస్టు విశేష సేవలందిస్తోంది. 2015 నుంచి ఆ సంస్థ జీజీహెచ్‌ అభివృద్ధికి కృషి చేస్తోంది. జీజీహెచ్‌కు అనుబంధంగా ప్రత్యేక క్యాన్సర్‌ సెంటర్‌ను నిర్మించి ఉచితంగా సేవలందిస్తోంది. ఈ సేవలకు పలుమార్లు కలెక్టర్‌ ద్వారా ప్రత్యేక పురస్కారాలు లభించాయి.

పసికందు మృతితో చలించి..

గుంటూరు జీజీహెచ్‌లో 2015లో ఎలుకల దాడిలో ఓ పసికందు మృతిచెందిన ఘటన జిల్లాకు చెందిన పారిశ్రామికవేత్త, నాట్కో ఫార్మా కంపెనీ, నాట్కో ట్రస్టు చైర్మన్‌ నన్నపనేని వెంకయ్యచౌదరి మనసును కలిచి వేసింది. అప్పటి నుంచి జీజీహెచ్‌కు ఆయన తనవంతు సాయం చేస్తూనే ఉన్నారు. పిల్లల వార్డు అభివృద్ధికి రూ.3కోట్లు ఇచ్చారు. 2020లో రూ. 50 కోట్లతో క్యాన్సర్‌ సెంటర్‌ నిర్మించారు. ఇటీవల తన సొంత నియోజకవర్గం పొన్నూరు మండలం మునిపల్లెలో రూ.15 కోట్లతో కంటి ఆస్పత్రిని నిర్మించి ఎల్వీప్రసాద్‌ హాస్పిటల్‌ సౌజన్యంతో ఉచితంగా ఆపరేషన్లు చేయిస్తున్నారు. తాజాగా క్యాన్సర్‌ చివరి దశలో ఉన్నవారికి ప్యాలెటీవ్‌ కేర్‌ చికిత్స అందించేందుకు జీజీహెచ్‌లో రూ.20 కోట్లతో నూతన క్యాన్సర్‌ సెంటర్‌ నిర్మాణం చేపట్టనున్నారు. దీనికి గురువారం శంకుస్థాపన చేయనున్నారు.

నాట్కో చేసిన అభివృద్ధి పనులు

● 2017లో జీజీహెచ్‌ న్యూరాలజీ వార్డుకు రూ.25 లక్షల ఖరీదు చేసే వైద్య పరికరాలను నాట్కో ట్రస్టు అందించింది.

● రూ.కోటితో ఓపీ వెయిటింగ్‌ హాల్‌, మరుగుదొడ్లు ఆధునికీకరించింది.

● 2018లో జీజీహెచ్‌ ఆర్ధోపెడిక్‌ వైద్య విభాగంలో రూ.కోటితో లామినర్‌ మాడ్యులర్‌ ఆపరేషన్‌ థియేటర్‌, పది పడకలతో ఐసీయూను ఏర్పాటు చేసింది.

● 2023లో డయాలసిస్‌ యూనిట్‌ను రూ.20 లక్షలతో ఆధునికీకరించింది.

● మానసిక వ్యాధుల వైద్య విభాగంలో రూ.10 లక్షలతో సెమినార్‌ హాలును 2024లో నిర్మించింది.

● నర్సింగ్‌ స్కూల్‌, వసతి గృహంలో వసతులు కల్పించింది.

అండగా నిలిచిన వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి

జీజీహెచ్‌లో నిర్మించిన నాట్కో క్యాన్సర్‌ సెంటర్‌ను 2020 జూలై 1న అప్పటి సీఎం వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి వర్చువల్‌గా ప్రారంభించారు. క్యాన్సర్‌ రోగులకు మెరుగైన చికిత్సలు అందించేందుకు వైద్య పరికరాలను, వైద్య సిబ్బందిని మంజూరు చేశారు. సర్జికల్‌ ఆంకాలజీ, మెడికల్‌ ఆంకాలజీ యూనిట్లు, పీజీ సీట్లనూ మంజూరు చేశారు.

పేద రోగుల సేవల్లో నాట్కోట్రస్టు

ఉచితంగా కార్పొరేట్‌ వైద్యసేవలు

గతంలో రూ.50 కోట్లతో

జీజీహెచ్‌లో క్యాన్సర్‌ సెంటర్‌

నిర్మాణం

ఇటీవల రూ.15 కోట్లతో జిల్లాలో

కంటి ఆస్పత్రి ప్రారంభం

రేపు రూ.20 కోట్లతో

జీజీహెచ్‌లో మరో క్యాన్సర్‌

సెంటర్‌ నిర్మాణానికి శంకుస్థాపన

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement