పరేషన్‌ ఏలనో..! | - | Sakshi
Sakshi News home page

పరేషన్‌ ఏలనో..!

Published Wed, Jan 29 2025 1:27 AM | Last Updated on Wed, Jan 29 2025 1:27 AM

పరేషన

పరేషన్‌ ఏలనో..!

గుంటూరు

ఈవీఎంల గిడ్డంగి తనిఖీ

లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్‌): కలెక్టరేట్‌ ఆవరణలోని ఈవీఎంల గిడ్డంగిని కలెక్టర్‌ ఎస్‌.నాగలక్ష్మి మంగళవారం తనిఖీ చేశారు. భద్రతను పరిశీలించారు.

ఉత్తమ డీఎం అవార్డు

మాచర్ల: మాచర్ల ఆర్టీసీ డిపో మేనేజర్‌ బత్తుల వీరాస్వామి ఉత్తమ అవార్డును కలెక్టర్‌ అరుణ్‌బాబు నుంచి అందుకున్నారు. బుధవారం వీరాస్వామిని పలువురు అభినందించారు.

బోల్తా కొట్టిన ఆటో

మంగళగిరి (తాడేపల్లి రూరల్‌) : మంగళగిరి జాతీయ రహదారి సర్వీస్‌రోడ్‌లో మంగళవారం ఆటో బోల్తా కొట్టింది. నలుగురికి గాయాలయ్యాయి.

బుధవారం శ్రీ 29 శ్రీ జనవరి శ్రీ 2025

సాక్షి ప్రతినిధి, గుంటూరు: రేషన్‌ దందాపై ప్రజాప్రతినిధులు ధ్వజమెత్తారు. సోమవారం జరిగిన జిల్లా సమీక్ష సమావేశం(డీఆర్సీ)లో రేషన్‌ దందా, కౌలు రైతుల కార్డులు, విద్యార్థులకు ఇప్పటివరకూ స్టడీ మెటీరియల్స్‌ ఇవ్వకపోవడంపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి, పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్‌ అధ్యక్షత వహించారు.

కఠిన చర్యలు తీసుకోవాలి

రేషన్‌ దందాపై పలువురు సభ్యులు మాట్లాడుతూ 6ఏ కేసులతో ఎందుకు సరిపెడుతున్నారని ప్రశ్నించారు. పీడీ యాక్ట్‌ ఎందుకు పెట్టడం లేదని నిలదీశారు. తాడికొండ శాసన సభ్యులు తెనాలి శ్రావణ కుమార్‌, శాసన మండలి సభ్యులు చంద్రగిరి ఏసురత్నం మాట్లాడుతూ రేషన్‌ బియ్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేకంగా పౌర సరఫరాల శాఖలో విజిలెన్స్‌ విభాగాన్ని బలోపేతం చేయాలన్నారు. రేషన్‌ బియ్యం అమ్ముకునే లబ్ధిదారులకు కార్డులు రద్దు చేస్తామని నోటీసులు ఇవ్వాలన్నారు. పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ స్పందిస్తూ రేషన్‌ బియ్యం అక్రమ రవాణా అరికట్టేందుకు సీఎం ఎస్పీలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని వివరించారు.

నియోజకవర్గాల వారీగా డ్రైవ్‌

మంత్రి నాదెండ్ల మనోహర్‌ మాట్లాడుతూ సీసీఆర్సీ కార్డులు ఇచ్చిన వారందరికీ రుణాలు మంజూరు చేసేలా నియోజకవర్గాల వారీగా డ్రైవ్‌ చేపట్టాలన్నారు. గుంటూరు జిల్లాలో 3.83 లక్షల ఉచిత గ్యాస్‌ సిలిండర్లు పంపిణీ చేశామన్నారు. రేషన్‌ వాహనాల వినియోగంపై సీఎంతో చర్చిస్తామన్నారు.

ప్రజాప్రతినిధులు ఏం మాట్లాడారంటే..!

● శాసన మండలిలో చీఫ్‌ విప్‌ పంచుమూర్తి అనురాధ మాట్లాడుతూ రైతులకు సాగునీరు సక్రమంగా అందించేలా కేడబ్ల్యూ కెనాల్‌ మరమ్మతులు చేపట్టాలన్నారు. రహదారుల మరమ్మతు పనులు వేగవంతంగా పూర్తి చేయాలన్నారు.

● రాజ్యసభ సభ్యులు ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి మాట్లాడుతూ శాఖల వారీగా ప్రాధాన్య అంశాలపై ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేస్తే సమస్యలు పరిష్కారమవుతాయని సూచించారు.

● ఎమ్మెల్సీ కేఎస్‌ లక్ష్మణరావు మాట్లాడుతూ రైతు, కౌలు రైతు సమస్యలు ప్రస్తావించారు. టెన్త్‌ విద్యార్థులకు ఇప్పటివరకు స్టడీ మెటీరియల్‌ ఇవ్వకపోవడం ఏమిటని ప్రశ్నించారు.

● ఎమ్మెల్సీ టి.కల్పలతా రెడ్డి మాట్లాడుతూ డోలాస్‌ నగర్‌ వాసులకు పట్టాలు ఇచ్చే అవకాశం పరిశీలించాలన్నారు. మోడల్‌ ప్రైమరీ స్కూల్‌ విలీనంలో ఉర్దూ స్కూల్స్‌కు మినహాయింపు ఇవ్వాలన్నారు.

● ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు మాట్లాడుతూ చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించేలా, ఆప్కో ఉత్పత్తులు కొనుగోలు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.

● కలెక్టర్‌ ఎస్‌.నాగలక్ష్మి మాట్లాడుతూ దుగ్గిరాలలో శుభం కోల్డ్‌ స్టోరేజీ అగ్నిప్రమాదంలో నష్టపోయిన పసుపు రైతులకు పరిహారం ఇన్సూరెన్స్‌ కంపెనీ అందించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

● ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్‌ మాట్లాడుతూ దీపం–2 పథకం నగదు జమలో ఇబ్బందులను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

● ఎమ్మెల్యేలు గళ్లా మాధవి, బూర్ల రామాంజనేయులు, నజీర్‌ అహ్మద్‌ మాట్లాడుతూ తమ నియోజకవర్గాల్లోని సమస్యలను ప్రస్తావించారు. సమావేశంలో సంయుక్త కలెక్టర్‌ ఎ.భార్గవ తేజ, నగరపాలక సంస్థ కమిషనర్‌ పులి శ్రీనివాసులు, తెనాలి సబ్‌ కలెక్టర్‌ సంజనా సింహా, అసిస్టెంట్‌ కలెక్టర్‌ స్వప్నిల్‌ పవార్‌ జగన్నాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

పట్నంబజారు(గుంటూరు ఈస్ట్‌): గుంటూరు కార్పొరేషన్‌ స్టాండింగ్‌ కమిటీ ఎన్నికల్లో గెలుపు తమదేనని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు ధీమా వ్యక్తం చేశారు. బృందావన్‌ గార్డెన్స్‌లోని పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫిబ్రవరి 3న స్టాండింగ్‌ కమిటీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న అనైతిక విధానాలను ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కార్పొరేషన్‌లో వైఎస్సార్‌ సీపీకి 45 మంది కార్పొరేటర్లు ఉండగా, టీడీపీకి 9 మంది, జనసేనకు ఇద్దరు మాత్రమే ఉన్నారని వెల్లడించారు. ఎన్నికల ముందు, తర్వాత ప్రలోభాలకు గురిచేసి కొందరు వైఎస్సార్‌ సీపీ కార్పొరేటర్లను టీడీపీ లాక్కుందని విమర్శించారు. కార్పొరేషన్లో కూటమికి బలం లేకున్నా.. స్టాండింగ్‌ కమిటీ ఎన్నికల్లో నామినేషన్‌ దాఖలు చేయటం హాస్యాస్పదంగా ఉందని పేర్కొన్నారు. నేరుగా ఎమ్మెల్యేలే కార్పొరేటర్‌ ఇళ్లకు వెళ్ళి బేరసారాలు ఆడుతున్నా రని విమర్శించారు. రూ. 30 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు వేలంపాట పెట్టి మరీ కార్పొరేటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారని ధ్వజమెత్తారు.

కమిషనర్‌పై అంబటి వ్యంగ్యాస్త్రాలు

ప్రస్తుతం 31 మంది కార్పొరేటర్లు తమ పక్షాన ఉన్నారని అంబటి స్పష్టంచేశారు. ఇటు నుంచి అటు వెళ్లిన వారూ తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. కార్పొరేషన్‌ కమిషనర్‌ కూడా రూ.9 కోట్ల 24 లక్షల అవినీతి డబ్బుతో కార్పొరేటర్లను కొనేందుకు బయలుదేరాడని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

టీడీపీవి నీచ రాజకీయాలు : ఎమ్మెల్సీ అప్పిరెడ్డి

ఎమ్మెల్సీ, వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ ఇటువంటి నీచ రాజకీయాలు తామెప్పుడూ చూడలేదన్నారు. టీడీపీ నేతలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. గెలుపు వైఎస్సార్‌ సీపీదేనని స్పష్టం చేశారు.

బలం మాదే : మోదుగుల

వైఎస్సార్‌ సీపీ గుంటూరు, పల్నాడు జిల్లాల పరిశీలకులు మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ కార్పొరేషన్‌లో ఇప్పటికీ బలమైన పార్టీ వైఎస్సార్‌ సీపీనేనని పేర్కొన్నారు. టీడీపీ కార్పొరేటర్లూ కూటమి సర్కారు తీరుతో అసంతృప్తిగా ఉన్నారని చెప్పారు. వైఎస్సార్‌ సీపీ నుంచి అటు వెళ్లిన వారూ తిరిగి రావాలని కోరారు.

స్టాండింగ్‌ కమిటీని కై వసం చేసుకుంటాం : మేయర్‌ మనోహర్‌

మేయర్‌ కావటి మనోహర్‌నాయుడు మాట్లాడుతూ స్టాండింగ్‌ కమిటీని వైఎస్సార్‌ సీపీ కైవసం చేసుకోవటం తథ్యమన్నారు. ప్రజాస్వామ్యంలో టీడీపీ నేతల తీరు ఏ మాత్రం సరికాదన్నారు.

వైఎస్సార్‌ సీపీ గెలుపును అడ్డుకోలేరు

ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం మాట్లాడుతూ స్టాండింగ్‌ కమిటీ ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ గెలుపును ఎవరూ అడ్డుకోలేరన్నారు. వైఎస్సార్‌ సీపీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్‌ నూరిఫాతిమా మాట్లాడుతూ ఫిబ్రవరి 3న జరిగే స్టాండింగ్‌ ఎన్నికల్లో 9 మంది నామినేషన్‌ వేశారని, పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికీ పార్టీ అండగా ఉంటుందని వివరించారు. సమావేశంలో డెప్యూటీ మేయర్‌, పార్టీ నగర అధ్యక్షుడు వనమా బాలవజ్రబాబు (డైమండ్‌బాబు), పార్టీ రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల రాజనారాయణయాదవ్‌ పాల్గొన్నారు.

కౌలు రైతులకు రుణాలివ్వండి

7

న్యూస్‌రీల్‌

స్టాండింగ్‌ కమిటీ ఎన్నికల్లో గెలుపు మాదే

టీడీపీ కుయుక్తులు ఫలించవు

కార్పొరేటర్ల కొనుగోలుకు

ఎమ్మెల్యేల బేరసారాలు

వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు

అంబటి రాంబాబు

6ఏ కేసులతో సరిపెడతారా?

పీడీ యాక్ట్‌ ఎందుకు పెట్టరూ?

నిలదీసిన ప్రజాప్రతినిధులు

వాడీవేడిగా డీఆర్సీ సమావేశం

తొలుత ఇన్‌చార్జి మంత్రి కందుల దుర్గేష్‌ మాట్లాడుతూ రెవెన్యూ, వ్యవసాయ శాఖ, బ్యాంకర్లు సమన్వయంతో వ్యవహరించి కౌలు రైతులకు రుణాలు అందించాలని ఆదేశించారు. త్వరలోనే ప్రభుత్వం కౌలు రైతుల కోసం కొత్త చట్టం తెస్తుందన్నారు. సీసీఆర్సీ కార్డులున్న రైతులకు రుణాలివ్వాల్సిందేనని, మార్చి 15లోగా నిర్దేశిత లక్ష్యాలను పూర్తిచేయాలని సూచించారు. పీపీపీ విధానంలో సందర్శకులు వచ్చే అన్ని దేవాలయాలు, దర్గాలు, చర్చిలను పర్యాటక సర్క్యుట్‌లో అనుసంధానం చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో నిర్వహించే రీజినల్‌ సెమినర్‌లో జిల్లా సమగ్ర పర్యాటక అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
పరేషన్‌ ఏలనో..! 1
1/7

పరేషన్‌ ఏలనో..!

పరేషన్‌ ఏలనో..! 2
2/7

పరేషన్‌ ఏలనో..!

పరేషన్‌ ఏలనో..! 3
3/7

పరేషన్‌ ఏలనో..!

పరేషన్‌ ఏలనో..! 4
4/7

పరేషన్‌ ఏలనో..!

పరేషన్‌ ఏలనో..! 5
5/7

పరేషన్‌ ఏలనో..!

పరేషన్‌ ఏలనో..! 6
6/7

పరేషన్‌ ఏలనో..!

పరేషన్‌ ఏలనో..! 7
7/7

పరేషన్‌ ఏలనో..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement