వరంగల్: మంత్రి కె.తారకరామారావు ఈ నెల 9న హనుమకొండకు వస్తున్నట్లు ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్ తెలిపారు. హనుమకొండ, కాజీపేటలోని కూడళ్లను అధికారులతో కలిసి మంగళవారం ఆయన పరిశీలించారు. రాత్రి వేళ రోడ్ల వెంట, ఫుట్‌పాత్‌లపై నిద్రించే వారి కోసం పునరావాస కేంద్రాలను నిర్మించేందుకు స్థలాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా దాస్యం వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ ఈ నెల 9న ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా హనుమకొండలో నిర్మిస్తున్న కాళోజీ కళాక్షేత్రాన్ని మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు 90 శాతం పనులు పూర్తయ్యాయని, 9వ తేదీలోపు అన్ని పనులు పూర్తయి ప్రారంభోత్సవానికి సిద్ధమవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
రూ.3 కోట్లతో 19 జంక్షన్లను అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. మునిసిపల్ ఓఎస్‌డీ కృష్ణ, కుడా చైర్మన్ సంగంరెడ్డి సుందర్‌రాజ్‌యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్‌ఖాన్, కుడా మాజీ చైర్మన్ యాదవరెడ్డి, మునిసిపల్ కార్పొరేషన్ ఈఈ రాజయ్య, డీఈ సంతోష్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment