లింగాలఘణపురం : మండలంలోని నెల్లుట్ల గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ నర్సింగ సురేశ్ (38) సోమవారం ట్రాక్టర్ బోల్తా పడిన ప్రమాదంలో దుర్మరణం చెందాడు. ఎస్సై శ్రావణ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. నర్సింగ సురేశ్ రోజు వారి డ్రైవర్‌గా వెళ్తు జీవనం సాగిస్తున్నాడు. సోమవారం గొరిగె సంపత్ ట్రాక్టర్ నడిపేందుకు తాత్కాలిక డ్రైవర్‌గా వెళ్లి ఓ రైతు పొలం దున్నుతుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తాపడి సురేశ్ అందులో ఇరుక్కుపోయాడు. దీంతో సమీపంలోని రైతులు గమనించి పొక్లెయినర్‌తో ట్రాక్టర్‌ను తొలగించి చూడగా అప్పటికే మృతి చెందాడు. పోలీసులు జనగామ ఏరియాఆస్పత్రికి మృతదేహన్ని తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment