వినతులు సత్వరమే పరిష్కరించాలి
కలెక్టర్లు డాక్టర్ సత్యశారద, ప్రావీణ్య
వరంగల్/హన్మకొండ అర్బన్: ప్రజావాణి వినతులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి సత్వరమే పరిష్కరించాలని వరంగల్, హనుమకొండ కలెక్టర్లు డాక్టర్ సత్యశారద, ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. ఆయా కలెక్టరేట్లలో సోమవారం వేర్వేరుగా నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమాల్లో వారు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి మాట్లాడారు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి త్వరితగతిన సమస్యలు పరిష్కరించాలని చెప్పారు. వరంగల్ ప్రజావాణికి 107 దరఖాస్తులు రాగా వాటిని సంబంధిత శాఖల అధికారులకు సిఫార్సు చేశారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, వరంగల్, నర్సంపేట ఆర్డీఓలు సత్యపాల్‌రెడ్డి, ఉమారాణి, డీఆర్డీఓ కౌసల్యదేవి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి పాల్గొన్నారు. హనుమకొండలో రెండు సోమవారాలు ఇతర కారణాలతో ప్రజావాణి నిర్వహించలేదు. దీంతో ఈసారి జనం భారీగా వచ్చి 156 వినతులు అందజేశారు. అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి, డీఆర్డీఓ శ్రీను ఇతర ఉన్నతాధికారులు స్వీకరించారు.
Comments
Please login to add a commentAdd a comment