రఘునాథపల్లి : వ్యవసాయ భూములు, ఇంటి స్థలాల తగాదాలో దాయాదుల బెదిరింపులు తాళలేక ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన సోమవారం మండలంలోని నక్కపొక్కల తండాలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. తండాకు చెందిన గుగులోత్ నరసింహ, లక్ష్మి, గుగులోత్ తిరుపతి, జ్యోతి, గుగులోత్ దేవయ్యలు గుగులోత్ కిష్టయ్యపై చేయి చేసుకొని చంపుతామని బెదిరించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన కిష్టయ్య ద్విచక్రవాహనంపై ఊరు అవతలకి వెళ్లి పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు గుర్తించి వెంటనే జనగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కిష్టయ్య భార్య భూలమ్మ ఫిర్యాదు మేరకు ఐదుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై డి.నరేష్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment