నాలా పనులకు కదలిక
సాక్షి, సిటీబ్యూరో: కొంత కాలంగా నిలిచిపోయిన నాలాల ఆధునికీకరణ, నిర్మాణ పనులను తిరిగి చేపట్టేందుకు జీహెచ్‌ఎంసీలోని వ్యూహాత్మక నాలా అభివృద్ధి పథకం (ఎస్‌ఎన్‌డీపీ) విభాగం సిద్ధమైంది. వర్షాకాలం ముగియడం.. నిర్మాణాలకు ఇప్పటి నుంచి వేసవి వరకు అనుకూల సమయం కావడంతో పనులకు టెండర్లు పిలిచింది. నగరంలో ముంపు సమస్యల పరిష్కారానికి గత ప్రభుత్వ హయాంలో ప్రత్యేకంగా ఎస్‌ఎన్‌డీపీని ఏర్పాటు చేశారు. తొలిదశలో దాదాపు రూ.985 కోట్లతో చేపట్టిన పనులు దాదాపుగా పూర్తయ్యాయి. రెండో దశలో ప్రాధాన్యతల మేరకు రూ.500 కోట్లతో పనులకు ప్రతిపాదనలు రూపొందించారు. ప్రస్తుతం వాటిని చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఇందులో తొలిదశలో తాజాగా దాదాపు రూ.75 కోట్ల పనులకు టెండర్లు పిలిచారు. టెండర్లు ముగియగానే పనులు చేపట్టనున్నారు. వీటిలో కొన్ని బాక్స్‌డ్రెయిన్ల నిర్మాణ పనులకు గతంలోనే టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో మరోసారి టెండర్లు పిలిచారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎస్‌ఎన్‌డీపీ పేరు మార్చి నగరంలో చేపట్టే అన్ని అభివృద్ధి పనులను హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్‌ఫార్మేటివ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (హెచ్–సిటీ ) పేరిట చేస్తోంది.
వీటికి టెండర్లు పిలిచారు..
● తిరుమల హాస్పిటల్ నుంచి సాగర్ రింగ్ రోడ్ జంక్షన్ వరకు వరద నీటి కాల్వ నిర్మాణం. అంచనా వ్యయం రూ.12.94 కోట్లు. ఏడాదిలోగా పూర్తి చేయాలనేది లక్ష్యం.
● రామంతాపూర్ చెరువు– ఉస్మానియా యూనివర్సిటీ వరకు వరదనీటి కాల్వ నిర్మాణం. అంచనా వ్యయం రూ. 12.61 కోట్లు. దీన్ని కూడా వచ్చే వర్షాకాలంలోగా పూర్తి చేయాలి.
● పర్కిచెరువు (ధరణినగర్) నుంచి కూకట్‌పల్లి నాలా (ప్రేమ్ సరోవర్ అపార్ట్‌మెంట్స్) వరకు ఆధునికీకరణ పనులు. అంచనా వ్యయం రూ.8.76 కోట్లు.
● డబీర్‌పురా దర్వాజ –ఫర్హత్‌నగర్ వరకు వరదనీటి కాల్వ నిర్మాణం. అంచనా వ్యయం రూ.11.55 కోట్లు.
● ఐడీఎల్ సర్‌ప్లస్ నాలా నుంచి కూకట్‌పల్లి నాలా (బస్‌డిపో) వరకు వరదనీటి కాల్వ ఆధునికీకరణ. అంచనా వ్యయం రూ.17.37 కోట్లు. దీన్ని 18 నెలల్లో పూర్తి చేయాలనేది లక్ష్యం.
● నేరేడ్‌మెట్‌లో సాయి ఎన్‌క్లేవ్ కరెంట్ ఆఫీస్ వరకు వరద కాల్వ నిర్మాణం. అంచనా వ్యయం రూ.6.26కోట్లు. దీని నిర్మాణ సమయం 9 నెలలు.
● కాలాపత్తర్ మహబూబ్ డెయిరీ నుంచి ఫాతిమా హాస్పిటల్ వరకు వరదకాల్వ అంచనా వ్యయం. రూ. 1.11కోట్లు. దీనికి గతంలో టెండరు పిలిచినా కాంట్రాక్టర్లు రాకపోవడంతో తిరిగి పిలిచారు.
బాక్స్ డ్రెయిన్ల పనులు.. రీ టెండర్లు
నాలాలకు సంబంధించి పలు బాక్స్ డ్రెయిన్ల పనులకు గతంలో టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. దాంతో వాటిల్లో కొన్నింటిని ఆర్నెల్లలో పూర్తి చేసే నిబంధనతో రీ టెండర్లు పిలిచారు.
రూ.75 కోట్లతో టెండర్లు
త్వరలో పనులు ప్రారంభం
అవి ఏమిటంటే..
ఉప్పుగూడ ప్రభుత్వ వెటర్నరీ హాస్పిటల్ –సుహానా ఫంక్షన్ హాల్. అంచనా వ్యయం రూ.72.87 లక్షలు.
చిరాగ్ అలీ లేన్. అంచనా వ్యయం రూ.76.62 లక్షలు.
ముమ్మిడికుంట–మిల్లత్ నగర్– సాదత్‌నగర్. అంచనా వ్యయం: రూ.1.60 కోట్లు.
ఇస్లామియా కాలేజీ వెనుక వైపు నుంచి సాదత్ నగర్ వరకు. అంచనా వ్యయం రూ.88.21 లక్షలు.
చాంద్రాయణ గుట్టలో సవేరా హోటల్–మాజిద్ ఇ అఫ్జల్ వరకు. అంచనా వ్యయం .రూ.82.37లక్షలు.
Comments
Please login to add a commentAdd a comment