గన్‌ఫౌండ్రీ: సనాతన ధర్మానికి, సంప్రదాయానికి చెందిన ధార్మిక, సేవా సంస్థలు ఒకే వేదికపైకి రావడం శుభపరిణామమని త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామి అన్నారు. గురువారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో హిందూ ఆధ్యాత్మిక సేవా ఫౌండేషన్ల ఆధ్వర్యంలో నాలుగు రోజుల పాటు నిర్వహిస్తున్న బృహత్‌మేళా సేవా ప్రదర్శన ఉత్సవాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.... ప్రస్తుత సమాజంలో స్వతంత్ర స్వేచ్ఛా ధోరణిని మరిచిపోయి బానిస ఆలోచనా తత్వాన్ని అలవర్చుచుకున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. బానిస ధోరణితో సాంకేతికతను అరువు తెచ్చుకునే పరిస్థితి నెలకొందన్నారు. సమాజంలో ఆధ్యాత్మికత కోసం కృషి చేస్తున్న సంస్థలు, సేవా సంస్థలు ఒకే వేదికపైకి వచ్చి నాలుగు రోజుల పాటు ప్రదర్శన నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. ఈ ప్రదర్శన 10 వరకు కొనసాగుతుందని చివరి రోజు రాష్ట్ర మంత్రి శ్రీధర్‌బాబుతో పాటు పలువురు ప్రముఖులు హాజరుకానున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో రామకృష్ణ మఠం స్వామీజీ శితికంఠానంద స్వామి, మాజీ ఐఏఎస్ అధికారి ఎల్‌వీ సుబ్రమణ్యం, ఆర్‌ఎస్‌ఎస్ జాతీయ కార్యవర్గ సభ్యులు భాగయ్య, ఫౌండేషన్ అధ్యక్షులు చంద్రశేఖర్, కార్యదర్శి రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.
చినజీయర్ స్వామి
Comments
Please login to add a commentAdd a comment