పద్మారావును పరామర్శించిన బీఆర్‌ఎస్ నేతలు
బన్సీలాల్‌పేట్: సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్‌ను బుధవారం బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సహా పలువురు నేతలు పరామర్శించారు. ఈ నెల 18న డెహ్రాడూన్ వెళ్లిన పద్మారావు మరుసటి రోజు గుండెపోటుకు గురి కావడంతో ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆయన గుండెకు స్టెంట్ వేశారు. చికిత్స అనంతరం ఆయన మంగళవారం రాత్రి నగరానికి చేరుకున్నారు. మోండా మార్కెట్ డివిజన్ టకారబస్తీలోని నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న పద్మారావును బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత, ఎంపీ రవిచంద్ర, మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, పువ్వాడ అజయ్, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే ముఠా గోపాల్, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, నాయకులు దానోజు శ్రావణ్, సలీమ్‌తో పాటు పలువురు కార్పొరేటర్లు పరామర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment