ప్రతీకాత్మక చిత్రం
ఉరుకులు, పరుగుల లైఫ్.. స్విగ్గీనో, జొమాటోనో ఓపెన్ చేయడం, నచ్చిన ఫుడ్ ఆర్డర్ పెట్టేయడం.. వండుకునే తీరిక లేకనో, కొత్త కొత్త రకాలు తినాలన్న కోరికనో దీనికి కారణం. మరి ఇలా ఫుడ్ ఆర్డర్ చేసి తినడం ఇప్పుడిప్పుడే మొదలైంది కాదంట. ఎప్పుడో మూడు వేల ఏండ్ల కింద కాంస్య యుగంలోనే ఇలా ఆహారం తెప్పించుకుని తినడం మొదలైందని ఆ్రస్టియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ శాస్త్రవేత్తలు తేల్చారు. ఆ్రస్టియాలోని ఆల్ప్స్ ప్రాంతంలో కాంస్య యుగం నాటి ఓ రాగి గనిలో చేసిన పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైందని వారు చెబుతున్నారు.
అప్పట్లో గనుల్లో తవ్వకాలు చేసి రాగిని వెలికితీసేందుకు ఓ ప్రత్యేకమైన కమ్యూనిటీ ఉండేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆ కమ్యూనిటీ నివసించే ప్రాంతాలు, గనుల్లో వారు కొన్నేళ్లుగా పరిశోధనలు చేస్తున్నారు. అక్కడ జరిపిన తవ్వకాల్లో పనిముట్ల నుంచి విశ్రాంతి దాకా.. నివాసానికి అవసరమైన చాలా రకాల వస్తువులు, పరికరాలు దొరికాయి. అప్పట్లో వారు తిని వదలేసిన ఆహార పదార్థాల శిలాజాలు కూడా లభించాయి.
చిత్రమైన విషయం ఏమిటంటే.. ఆ ప్రాంతాల్లో ఎక్కడా కూడా వంట వండటానికి సంబంధించిన వస్తువులుగానీ, ఏర్పాట్లుగానీ కనిపించలేదు. ఇదేమిటని పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు.. ఈ కమ్యూనిటీ వారంతా వేరే ప్రాంతం నుంచి ఫుడ్ తెప్పించుకుని తినేవారని తేల్చారు. వంట రెడీ చేసి, తెచ్చి పెట్టే పనిని మరో కమ్యూనిటీ వారు చేసేవారని అంచనా వేస్తున్నారు.
పరిశోధనల చిత్రం (క్రెడిట్ : పీటర్ ట్రెబ్స్చే, యూనివర్సిటీ ఆఫ్ ఇన్స్‌బ్రక్)
Comments
Please login to add a commentAdd a comment