బీజింగ్: చైనా ఎప్పుడూ ఆధిపత్యాన్ని కోరుకోదని.. కోల్డ్‌వార్ లేదా హాట్ వార్ లాంటివి తమకు అవసరం లేదంటూ చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఐక్యరాజ్యసమితి 75వ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 'తూర్పు లఢాఖ్‌లోని చైనా, భారత్‌సైన్యాల మధ్య గత నాలుగు నెలుగా ప్రతిష్టంభన కొనసాగుతున్న నేపథ్యంలో విభేదాలను తగ్గించి చర్చల ద్వారా వివాదాలను పరిష్కరించుకోవాలి' అంటూ యూఎన్ సమావేశానికి ముందు రికార్డ్ చేసిన వీడియోలో జిన్‌పింగ్ ఈ విషయాలను వెల్లడించారు. (చైనాపై మరోసారి మండిపడ్డ ట్రంప్)
దేశీయంగా, అంతర్జాతీయంగా కొత్త అభివృద్ధి నమూనాని రూపొందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. ఇది చైనా ఆర్థిక వృద్ధితో పాటు, ప్రపంచ ఆర్థిక వృద్ధికి తోడ్పాటునందిస్తుంది. అభివృద్ధి చెందుతున్న దేశమైన చైనా అన్ని దేశాలతో శాంతియుత, సహకార సంబంధాలకు కట్టుబడి ఉంది. వివిధ దేశాలతో ఉన్న వివాదాలను చర్చల ద్వారా, సంభాషణల ద్వారా తగ్గించుకుంటామని పునరుద్ఘాటించారు. (పాపం.. జిన్‌పింగ్)
కరోనా వైరస్ వ్యాప్తి విషయంలో చైనాపై అంతర్జాతీయంగా వస్తున్న ఆరోపణలను తోసిపుచ్చారు. వైరస్‌ను ఎదుర్కోవడానికి అన్ని దేశాలు సమిష్టిగా ముందుకురావాలి. ఈ మహమ్మారిని అధిగమించడానికి అంతర్జాతీయంగా ఉమ్మడిగా ప్రణాళికను రూపొందించాలి. సమస్యను రాజకీయం చేయడం సరైన విధానం కాదు' అని అన్నారు. కాగా.. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో యూఎన్ సర్వసభ్య సమావేశాలను వర్చువల్ విధానంలో నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment