అమెరికాలో ఓ చైనీస్ రెస్టారెంట్‌పై దాడి జరిగింది. ముసుగులో వచ్చిన కొందరు ఆకతాయిలు.. రెస్టారెంట్‌ను ధ్వంసం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ట్విటర్, వీచాట్‌లో చక్కర్లు కొడుతోంది.
దాడికి సంబంధించిన వీడియోను ప్రముఖ ఉద్యమకారిణి యియాటిన్ చూ తన ట్విటర్ వాల్‌పై పోస్ట్ చేశారు. టేబుళ్లను కిందపడేసి, పాత్రలను పగలకొట్టి, కుర్చీలను విరగొట్టి.. విధ్వంసానికి పాల్పడిన దుండగులు, చివరికి సిబ్బందిని సైతం బెదిరించినట్లు తెలుస్తోంది. దాడికి పాల్పడింది స్థానిక యువతగా తెలుస్తోంది. అయితే వాళ్ల ఆచూకీని ఇంకా పోలీసులు కనిపెట్టలేదు.
న్యూయార్క్‌లోని క్వీన్స్‌లోని ఫిష్ విలేజ్ రెస్టారెంట్‌లో ఈ దాడి చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. అసలు వాళ్లు దాడికి ఎందుకు పాల్పడ్డారో కూడా తమకు అర్థం కావడం లేదంటూ రెస్టారెంట్ సిబ్బంది ఒకరు మీడియాకు వివరించారు. అనుమానితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. అయితే.. వాళ్లు మైనర్లు అని, స్థానికంగా వోల్ఫ్ గ్యాంగ్ పేరుతో తమ హీరోయిజం ప్రదర్శించుకునే బచ్చాగ్యాంగ్ అని కొందరు స్థానికులు చెప్తున్నారు.
This video is going viral on WeChat. Fish Village, a restaurant in College Point, Qns was ransacked by a gang of masked kids in hoodies.
— Yiatin Chu (@ycinnewyork) March 7, 2023
We’ve fallen so low that there’s no expectation of consequences for this horrific attack on private property. pic.twitter.com/DQdnHPR5r8
Comments
Please login to add a commentAdd a comment