ఇజ్రాయెల్‌పై హమాజ్‌ మెరుపు దాడి.. 20 నిమిషాల్లోనే 5 వేల రాకెట్లతో... | Israel Forces Say Ready For War After Rocket Attacks From Gaza | Sakshi
Sakshi News home page

ఇజ్రాయెల్‌పై రాకెట్ల వర్షం.. పశ్చిమాసియాపై యుద్ధ మేఘాలు

Published Sat, Oct 7 2023 11:28 AM | Last Updated on Sat, Oct 7 2023 4:23 PM

Israel Forces Say Ready For War After Rocket Attacks From Gaza - Sakshi

► ఇజ్రాయేల్‌, పాలస్తీనా మధ్య ఒక్కసారిగా యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. ఇజ్రాయేల్‌పై హమాజ్‌ ఉగ్రవాదులు మెరుపు దాడి చేపట్టారు.  గాజా స్ట్రిప్ నుంచి భీకర రాకెట్ దాడులతో విరుచుకుపడ్డారు. శనివారం ఉదయం 20 నిమిషాల్లోనే 5 వేల రాకేట్లు ప్రయోగించింది.

► దీంతో ఇజ్రాయేల్‌ ప్రభుత్వం గాజా సరిహద్దుల్లో ఎమర్జెన్సీ విధించి.. యుద్ధంపై ప్రకటన చేసింది. మిలిటెంట్ల చొరబాటుతో దేశవ్యాప్తంగా పెద్ద సైరన్లు మోగించింది .హమాస్‌ మిలిటెంట్లపై ‘ఆపరేషన్‌ ఐరన్‌ స్వోర్డ్స్‌’ ప్రారంభించినట్లు  ఆ దేశ రక్షణ దళాలు పేర్కొన్నాయి. హమాజ్‌ తగిన మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించింది. దేశంలోని ఎయిర్‌పోర్టులను పూర్తిగా మూయించింది.  హమాస్‌ దాడిలో ఇజ్రాయెల్‌ పౌరులు మృతి చెందారు. 35 మంది పౌరులను బందీలుగా పట్టుకుంది. 

జెరూసలేం: ఇజ్రాయేల్‌ దేశంలో మరోసారి అలజడి నెలకొంది. ఇజ్రాయేల్‌, పాలస్తీనా మధ్య ఉద్రిక్తతలు మళ్లీ భగ్గుమన్నాయి పాలస్తీనాకు చెందిన ఇస్లామిస్ట్ గ్రూపు హమాజ్‌దక్షిణ ఇజ్రాయేల్‌లోకి చొరబడి రాకెట్లను ప్రయోగించింది. శనివారం ఉదయం 6.30 గంటల సమయంలో గాజా స్ట్రిప్‌ ప్రాంతం నుంచి ఇజ్రాయేల్‌వైపు డజన్ల కొద్దీ మిస్సైల్స్‌ విరుచుకుపడ్డాయి. ఇళ్లు, భవనాలపై దూసుకొచ్చి రాకెట్ల దాడుల్లో ఓ మహిళ మరణించింది. దీంతో అప్రమత్తమైన ఇజ్రాయెల్‌ సైన్యం ప్రతిదాడికి దిగింది. ఆ వెంటనే సైరన్లు మోగించి.. గాజా సరిహద్దులో ఎమర్జెన్సీ ప్రకటించింది.

గాజా, గ్రేటర్‌ టెల్‌ అవీవ్‌ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున పేలుళ్ల శబ్ధం వినిపించడంతో ఇజ్రాయేల్‌ సైన్యం అప్రమత్తమై యుద్ధ స్థితిని ప్రకటించింది. తాజా పరిణామాలతో ఇజ్రాయెల్‌లో యుద్ధ మేఘాలు అలుముకున్నట్లు సైన్యం ప్రకటించింది. ఏ క్షణమైన పూర్తి స్థాయి యుద్ధానికి తాము సిద్ధంగా ఉన్నామని ఇజ్రాయేల్‌ సైన్యం పేర్కొంది. దేశ దక్షిణ, మధ్య ప్రాంతాల్లో గంటకుపైగా ఫైర్‌ సైరన్‌లు మోగించి ప్రజలను హెచ్చరించింది. అనేకమంది ఉగ్రవాదులు ఇజ్రాయేల్‌ భూభాగంలోకి చొరబడ్డారని పేర్కొంది.  ప్రజలు తమ ఇళ్లు లేదా బాంబు షెల్టర్ల వద్ద ఉండాలని కోరింది.

మరోవైపు ఇజ్రాయేల్‌పై యుద్ధం ప్రారంభమైనట్లు హమాస్‌ గ్రూప్‌ నాయకుడు ప్రకటించారు. ఇజ్రాయేల్‌ను వ్యతిరేకిస్తున్న మహాస్‌ గ్రూప్‌ చీఫ్‌ మహమ్మద్‌ డీఫ్‌ పేరు మీద ఈ ప్రకటన విడుదలైంది. ‘ఆపరేషన్ అల్-అక్సా’ పేరుతో శనివారం తెల్లవారుజామున ఇజ్రాయెల్‌పై 5,000 రాకెట్లను ప్రయోగించినట్లు మహమ్మద్ డీఫ్ పేర్కొన్నారు. కాగా ఇజ్రాయేల్‌ చేసిన అనేక ఆపరేషర్ల నుంచి డీఫ్‌ తప్పించుకొని బయటపడినవాడు.  అండర్‌ గ్రౌండ్‌లో ఉంటాడు, ఆచూకీ బయటపడకుండా చూసుకుంటాడు. కేవలం వీడియో సందేశాలను రికార్డు చేసి ప్రకటిస్తాడు. ప్రపంచంలోనే అత్యంత పవర్‌ఫుల్‌ అయిన ఇజ్రాయేల్‌ ఇంటలిజెన్స్‌కు దొరక్కుండా జాగ్రత్త పడతాడు.

రాకెట్‌ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇందులో ఇజ్రాయెల్ సరిహద్దు పట్టణమైన స్డెరోట్‌లో కాల్పుల శబ్దం వినబడుతోంది. మరో వీడియోలో గాజా స్ట్రిప్ సరిహద్దులో హమాస్, పాలస్తీనా మిలిటెంట్లు ఇజ్రాయేల్ మిలిటరీ ట్యాంక్‌ను స్వాధీనం చేసుకొని తగలబెడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.

ఇక ఇజ్రాయేల్ దేశంలోకి ఎంత మంది ఉగ్ర‌వాదులు చొర‌బ‌డ్డారనేది స్ప‌ష్టంగా తెలియ‌లేదదు. ప్ర‌స్తుతం హ‌మాస్‌, ఇజ్రాయేల్‌ మ‌ధ్య కాల్పులతో భీక‌ర పోరు న‌డుస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఈ కాల్పుల్లో పలువురు సామాన్య పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. మృతుల సంఖ్య భారీగానే ఉండొచ్చని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. అటు సరిహద్దుపై ఇజ్రాయేల్‌ సైన్యం నియంత్రణ కోల్పోయినట్లు తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement