
Russia Ukraine Crisis: రష్యా దాడికి ప్రతి చర్య తప్పదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హెచ్చరించారు. ఉక్రెయిన్‌పై రష్యా అన్యాయంగా దాడి చేస్తోందని, ఈ పరిణామాలకు రష్యానే తప్పక బాధ్యత వహించాలన్నారు. యుద్ధం వల్ల సంభవించే మరణాలు, సంక్షోభాలకు రష్యానే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. అక్కడి పరిస్థితులను వైట్ హౌస్ నుంచి తాను పర్యవేక్షిస్తున్నానని, నేషనల్ సెక్యూరిటీ టీం నుంచి ఎప్పటికప్పుడు వివరాలు తెప్పించుకుంటున్నానని బైడన్ తెలిపారు. జీ7 దేశాలతో పాటు నాటో కూటమి దేశాలను సమన్వయం చేస్తున్నట్లు చెప్పారు.