అన్నంలో పురుగులు.. నీళ్ల చారు
● పాత ఏజెన్సీ నిర్వాహకులతో ఇబ్బందులు ● మూడు నెలలుగా తల్లిదండ్రులతోనే వంటలు ● కలెక్టర్‌కు మొరపెట్టుకున్న విద్యార్థులు
ధర్మపురి/జగిత్యాలటౌన్: మధ్యాహ్నభోజనం విషయంలో పాత ఏజెన్సీ నిర్వాహకులు ఇబ్బంది పెడుతున్నారని, వారి వంటలు తినలేకపోతున్నామని, వారి నుంచి కాపాడాలని విద్యార్థులు ప్రజావాణిలో కలెక్టర్‌కు తమ గోడు వెల్లబోసుకున్నారు. పాత నిర్వాహకులను పాఠశాలకు రానివ్వద్దంటూ పిల్లల తల్లిదండ్రులు కూడా ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది. మండలంలోని ఆరెపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు 55 మంది విద్యార్థులున్నారు. మధ్యాహ్న భోజనం రుచిగా ఉండడంలేదని, అన్నంలో పురుగులు, వెంట్రుకలు వస్తున్నాయని, నీళ్లచారుతో భోజనం పెడుతున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. నిర్వాహకులను తొలగించాలంటూ గతంలో కూడా రోడ్డుపై బైఠాయించారు. ఎంపీడీవో రవీందర్, అప్పటి ఇన్‌చార్జి ఎంఈవో గంగాధర్, పోలీసుల వరకు చేరినా సమస్య పరిష్కారం కాలేదు. మూడు నెలలుగా పిల్లల తల్లిదండ్రులే వంట చేసి పిల్లలకు పెడుతున్నారు. కొద్దిరోజులుగా పాత నిర్వాహకులు ప్రతిరోజూ పాఠశాలకు వచ్చి సమస్య సృష్టిస్తున్నారు. దీంతో విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.
కోర్టు ఆర్డర్ తెచ్చారు
గతంలో ఏజెన్సీని రద్దు చేశాం. తల్లిదండ్రులతో తాత్కాలికంగా వంట చేయిస్తున్నం. పాత నిర్వాహకులు కోర్టు నుంచి తామే వంట చేస్తామని ఆర్డర్ కాపీ తెచ్చుకున్నరు. వారు వండితే విద్యార్థులు తినబోని అంటున్నారు.
– మధూకర్‌రెడ్డి, హెచ్‌ఎం
Comments
Please login to add a commentAdd a comment