కాలుష్యం తగ్గించడానికే ఎలక్ట్రిక్‌ వాహనాలు | - | Sakshi
Sakshi News home page

కాలుష్యం తగ్గించడానికే ఎలక్ట్రిక్‌ వాహనాలు

Published Tue, Nov 26 2024 12:51 AM | Last Updated on Tue, Nov 26 2024 12:51 AM

కాలుష్యం తగ్గించడానికే ఎలక్ట్రిక్‌ వాహనాలు

కాలుష్యం తగ్గించడానికే ఎలక్ట్రిక్‌ వాహనాలు

రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్‌

కరీంనగర్‌: కాలుష్యాన్ని తగ్గించడానికే ఎలక్ట్రిక్‌ వాహనాలను ప్రోత్సహిస్తున్నామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. కరీంనగర్‌లోని ఆర్టీసీ వర్క్‌షాప్‌ ఎదురుగా ఏర్పాటు చేసిన ఎస్‌ఎస్‌ ఎకో ఎలక్ట్రిక్‌ వెహికిల్‌ షోరూంను సోమవారం ఆయన ప్రారంభించారు. ఆర్టీసీలో ఎలక్ట్రిక్‌ బస్సుల వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని, సంస్థకు లాభాలు వస్తున్నాయని తెలిపారు. ఇలాంటి వాహనాలను వినియోగదారులు ఉపయోగిస్తే కాలుష్య రహిత ప్రాంతాలుగా తీ ర్చిదిద్దే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అనంతరం కంపెనీ ఎండీ పి.సంగీత మాట్లాడుతూ.. ఎలక్ట్రిక్‌ వాహనాలకు మార్కెట్‌లో ప్రాధాన్యం ఉందని, కొనుగోలు చేసేవారికి కంపెనీ మంచి ఆఫర్‌ ఇచ్చిందని తెలిపారు. నిర్వాహకుడు గూటం వేణుగోపాల్‌ రెడ్డి మంత్రి ప్రభాకర్‌ను సన్మానించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement