జగిత్యాలక్రైం: జగిత్యాల జిల్లా కేంద్రంలోని వాణీనగర్‌కు చెందిన బోగ కృష్ణహరి ఇంట్లో ఆదివారం రాత్రి గుర్తుతెలియని దొంగలు చొరబడి 9 తులాల బంగారం, రూ.20 వేలు ఎత్తుకెళ్లినట్లు హెడ్‌కానిస్టేబుల్ మోహన్ తెలిపారు. కృష్ణహరి కుటుంబసభ్యులతో కలిసి ఆదివారం ఉదయం ఇంటికి తాళం వేసి విజయవాడ దుర్గమాత దర్శనానికి వెళ్లారు. సోమవారం తిరిగి వచ్చేసరికి ఇంటి తాళాలు పగులగొట్టి ఉన్నాయి. ఇంట్లోకి వెళ్లి పరిశీలించగా బీరువాలో ఉన్న 9 తులాల బంగారు ఆభరణాలు, రూ.20వేలు కనిపించలేదు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు హెడ్‌కానిస్టేబుల్ తెలిపారు.
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): తాళం వేసిన ఓ ఇంట్లో దుండగులు చొరబడి, ఆభరణాలు, నగదు ఎత్తుకెళ్లారు. ఎస్సై రమాకాంత్ వివరాల ప్రకారం.. ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల బొప్పాపూర్‌కు చెందిన రాయవేని సురేందర్ ఆదివారం ఇంటికి తాళం వేసి, కుటుంబసభ్యులతో కలిసి రాజన్నపేటలో తన తల్లి దినకర్మకు వెళ్లాడు. సోమవారం ఉదయం వచ్చి చూడగా తాళం పగులగొట్టి ఉంది. బీరువాలో చూడగా 25 తులాల వెండి ఆభరాణాలతోపాటు రూ.80 వేలు కనిపించలేదు. దొంగతనం జరిగినట్లు నిర్ధారించుకొని, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
కోరుట్ల: తాళం వేసిన ఇంట్లో దొంగలు పడి, బంగారు ఆభరణాలు, నగదు ఎత్తుకెళ్లారు. పోలీసుల కథనం ప్రకారం.. కోరుట్ల పట్ట ణంలోని ఝాన్సీ రోడ్‌కు చెందిన కొండబత్తిని గంగాకిషన్ నాలుగు రోజుల క్రితం ఇంటికి తాళం వేసి, భార్యతో కలిసి హైదరాబా ద్‌లో ఉన్న కుమారుడి వద్దకు వెళ్లాడు. సోమవారం సాయంత్రం ఇంటి తాళం పగులగొట్టి ఉండటాన్ని పక్కింటివారు గుర్తించి, అతనికి ఫోన్‌లో సమాచారం అందించారు. గంగాకిషన్ వెంటనే తన బంధువులకు ఫోన్ చేసి, ఇంటికి వెళ్లమని చెప్పాడు. వారు వచ్చి, పరిశీలించగా లోపల సామగ్రి చిందరవందరగా ఉంది. గంగాకిషన్ చెప్పినట్లు బీరువాలోని 5 తులాల బంగారు ఆభరణాలు, రూ.8 వేలు కనిపించలేదు. చోరీ జరిగినట్లు నిర్ధారించుకొని, వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సీఐ సురేశ్‌బాబు, ఎస్సై శ్రీకాంత్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. బాధితుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment