జగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాలో యాసంగి సీజన్లో వరి ప్రధాన పంటగా మారనుంది. కనీసం 3.05 లక్షల ఎకరాల్లో సాగు చేసేందుకు అన్నదాతలు నా రుమడులు సిద్ధం చేస్తున్నారు. అనువైన విత్తన రకాలను ఎంపిక చేసుకునేందుకు ఎక్కువగా ప్రైవే ట్ కంపెనీలపైనే ఆధారపడుతున్నారు. ఆయా ప్రా ంతాల్లో నీటివసతిని బట్టి దీర్ఘకాలిక (140 నుంచి 150 రోజులు), మధ్యకాలిక (130 నుంచి 140 రో జులు), స్వల్పకాలిక (120 నుంచి 130 రోజులు) రకాలను ఎంపిక చేసే పనిలో పడ్డారు. యాసంగి సీజన్లో పొడి వాతావరణ పరిస్థితులు ఉండటంతో ఎక్కువగా దొడ్డు వరి రకాలను, అక్కడక్కడ సన్నా ల సాగుకు ముందుకొస్తున్నారు.
దొడ్డు రకాల్లో ప్రధానమైనవి
కేఎన్ఎం–118 (కూనారం సన్నాలు), జేజీఎల్–18047 (బతుకమ్మ), జేజీఎల్–24423(జగిత్యాల రైస్–1), ఆర్ఎన్ఆర్–29325, ఎంటీయూ–1010 రకాలు సాగు చేస్తున్నారు. ఈ రకాల దిగుబడి ఎకరాకు 28 నుంచి 32 క్వింటాళ్ల వరకు వస్తుంది. చలి, సుడిదోమను తట్టుకుంటాయి. జిల్లాలో పంట కా లం తక్కువగా ఉండే రకాలను సాగు చేసేందుకు అఽ దిక ప్రాధాన్యం ఇస్తున్నారు. సన్న రకాల్లో ఆర్ఎన్ఆర్–15048, కేఎన్ఎం–1638, డబ్ల్యూజీఎల్–962 రకాలు ప్రధానమైనవి. రైతులు ఆయా ప్రాంతాలకు అనువైన రకాలను మాత్రమే ఎంపిక చేసుకోవాలి. కొన్ని రకాలు ఒక్క ప్రాంతంలో అధిక దిగుబడినిస్తే.. మరికొన్ని ప్రాంతాల్లో దిగుబడి ఇవ్వవు. రైతులు వరి విత్తనాలను ఎంపిక చేసుకునేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. నారుమడిలోనే అన్ని రకాల యాజమాన్య పద్ధతులు పాటిస్తే తెగుళ్ల, పురుగుల బెడద ఉండదు. చలి కాలంలో నారు పెంపకం సమయంలో భాస్వరం ఎక్కువగా ఇస్తూ.. ఉదయం నీటిని అందిస్తూ ఉండాలి.
Comments
Please login to add a commentAdd a comment