ఎరువుల ‘మంద’ | - | Sakshi
Sakshi News home page

ఎరువుల ‘మంద’

Published Fri, Jan 31 2025 2:09 AM | Last Updated on Fri, Jan 31 2025 2:09 AM

ఎరువుల ‘మంద’

ఎరువుల ‘మంద’

నేలకు సత్తువ.. నాణ్యమైన పంట

రైతుల చేలలో గొర్రెల మందల సందడి

నత్రజని, కర్బనం పుష్కలం

ఒక రోజు వెయ్యి గొర్రెల మందకు రూ.2,200

బోయినపల్లి(చొప్పదండి): గ్రామీణ ప్రాంతాల రైతులు గొర్రెలు, మేకల ఎరువు వాడకంపై ఆసక్తి చూపుతున్నారు. తమ పంటచేలలో రోజుల తరబడి గొర్రెల మందలు పెట్టిస్తున్నారు. గొర్రెలు, మేకలు విసర్జించే మలమూత్రాలతో భూమి సారవంతం కావడంతో పాటు నాణ్యమైన దిగుబడి వస్తుందని పేర్కొంటున్నారు. ప్రస్తుతం వరిపంట కోసి.. పత్తి ఏరిన రైతులు ఆ చేలలో మందలు పెట్టిస్తున్నారు. గొర్రె ఎరువులో సహజంగా నత్రజని, కర్బనం ఉంటాయని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు.

మందను బట్టి రేటు

గొర్రెల కాపర్లు గొర్రెలు, మేకల విక్రయంతో పాటు వాటి ఎరువును విక్రయించి అదనపు ఆదాయం పొందుతున్నారు. జనవరి నుంచి మే వరకు పంటచేలలో మందలు పెడతారు. గొర్రెలు, మేకలను పంటచేలలో ఉంచడాన్ని మంద పెట్టడం అంటారు. మందను బట్టి ధర నిర్ణయిస్తారు. 500 మేర గొర్రెలు ఉన్న మందకు రోజుకు రూ.1,000.. దాదాపు వెయ్యి గొర్రెలు, మేకలు ఉండే మందకు రూ.2,000 తీసుకుంటారు. ఎకరం చేనులో 500 గొర్రెల మంద ఆరురోజుల పాటు ఉంచుతామని పేర్కొంటున్నారు. సాయంత్రం 6 నుంచి ఉదయం 11 గంటల వరకు గొర్రెలు, మేకలు మందలో ఉంటాయి. తర్వాత వాటిని మేతకు తీసుకెళ్తారు. గొర్రె ఎరువు ఒక ట్రాక్టర్‌ ట్రిప్పునకు ధర రూ.2,500 ఉంటుంది.

నాణ్యమైన పంట

రైతులు పొలాల్లో విత్తనం నాటిన నుంచి పంట ఎదిగే వరకు పలుసార్లు వివిధ రకాల ఎరువులు, పురుగు మందులు పిచికారీ చేస్తారు. అయితే గొర్రెల మంద పెట్టిన చేలలో అడుగు మందు కూడా తక్కువగా వినియోగించే అవకాశం ఉంటుందని రైతులు చెబుతున్నారు. వరికి దోమ పోటు రాదని, పత్తి దిగుబడి బాగా వస్తుందని, మంద పెట్టిన చేలలో సుమారు రెండేళ్ల పాటు సహజ ఎరువు ఉంటుందని పేర్కొంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement