విద్యార్థులు ఒత్తిడికి గురికావద్దు
● డీఈవో రాము
జగిత్యాల: పదో తరగతి విద్యార్థులు పరీక్షల్లో ఒత్తిడికి గురికావద్దని, ప్రశాంతమైన వాతావరణంలో రాయాలని డీఈవో రాము అన్నారు. గురువారం ఉపాధ్యాయులకు రెండు రోజలు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.ఉపాధ్యాయులందరూ విద్యార్థులకు పరీక్షలు రాసేందుకు ధైర్యం నింపాలని, వారికి పరీక్షలపై అవగాహన కల్పించాలన్నారు. అలాగే విద్యార్థులు కౌమార దశలో అనేక సమస్యలుంటాయని, వారిలో ఒత్తిడి లేకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్ రాజేందర్, దత్తాత్రి, రాజశేఖర్, కరీంనగర్ డైట్ లెక్చరర్ హబీబ్, సెక్టోరియల్ అధికారి కొక్కుల రాజేశ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment