మహాత్మా.. సీఎంకు జ్ఞానోదయం కలిగించు
జగిత్యాల: మహాత్మా.. సీఎం రేవంత్‌రెడ్డికి జ్ఞానోదయం కలిగించు అంటూ జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత అన్నారు. గురువారం మహాత్మాగాంధీ వర్ధంతిని పురస్కరించుకుని మంచినీళ్ల బావి వద్దనున్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.గాంధీ ఆశయాలతో బీఆర్ఎస్ పదేళ్లలో తెలంగాణను ప్రగతి పథంలో నడిపించామని, సబ్బండవర్గాల సంక్షేమమే లక్ష్యంగా శ్రీకారం చుట్టామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇచ్చిన 420 హామీల్లో ఒక్కటీ అమలు చేయడం లేదన్నారు. రైతుభరోసా కింద రూ.15 వేలు ఇస్తామని రూ.6వేలు ఇస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే 410 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. కల్యాణలక్ష్మితోపాటు తులం బంగారం ఏమైందన్నారు. మార్కెట్ కమిటీ మాజీ చైర్పర్సన్ శీలం ప్రియాంక, ఆనందరావు, మల్లేశ్ పాల్గొన్నారు.
హామీలు అమలు చేయండి
మెట్పల్లి: ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయండని ఎమ్మెల్యే సంజయ్ అన్నారు. గాంధీ వర్ధంతి సందర్భంగా పట్టణంలోని గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందించారు. ఆరు గ్యారెంటీలు ఇచ్చిన కాంగ్రెస్ వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పి ప్రజలను మోసం చేసిందన్నారు. నాయకులు మారు సాయిరెడ్డి, సందిరెడ్డి శ్రీని వాస్‌రెడ్డి, ఎలాల దశరథరెడ్డి తదితరులున్నారు.
హామీలు నెరవేర్చండి
ధర్మపురి: కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డీసీఎమ్మెస్ ఉమ్మడి జిల్లా చైర్మన్ శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ నాయకులు మహాత్మగాంధీ విగ్రహానికి వినతిపత్రాలు సమర్పించి నిరసన వ్యక్తం చేశారు. 420రోజులు గడుస్తున్నా.. 420 హామీలు అమలు కావడం లేదన్నారు. కార్యక్రమంలో నాయకులు అయ్యోరి రాజేష్, ఆకుల రాజేష్, సంగి శేఖర్, ఆసిఫ్, చిలుముల లక్ష్మణ్ తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment