పసుపు పరిశోధన స్థానం సందర్శన
జగిత్యాలఅగ్రికల్చర్: పొలాస వ్యవసాయ కళా శాల రావెప్ విద్యార్థులు శిక్షణలో భాగంగా గ ురువారం నిజమాబాద్ జిల్లా కమ్మర్‌పల్లిలోని పసుపు పరిశోధన స్థానాన్ని సందర్శించారు. పసుపుపై జరుగుతున్న పరిశోధనలపై శాస్త్రవేత్తలు బి.మహేందర్, పి.శ్రీనివాస్ విద్యార్థుల కు వివరించారు. వ్యవసాయ వర్సిటీ సలహా మండలి మాజీ సభ్యులు పూడూరు రాంరెడ్డి పాల్గొన్నారు. పసుపు బోర్డు ఏర్పాటైనందున అత్యధిక కుర్కుమిన్ శాతం ఉండే పసుపు రకాలను రైతులకు పరిచయం చేయాలని సూచించారు.
పదో తరగతి విద్యార్థులకు స్నాక్స్
● నిధులు మంజూరు చేసిన విద్యాశాఖ
● వచ్చేనెల ఒకటి నుంచి అమలు
రాయికల్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు అల్పాహారం పెట్టేందుకు నిధులు మంజూరు చేస్తున్నట్లు డీఈవో రాము తెలిపా రు. ‘ఆకలి చదువులు’ శీర్షికన గురువారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి డీఈఓ స్పందించారు. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి మార్చి 20వరకు పదవ తరగతి విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.15 చొప్పున స్నాక్స్ కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని తెలిపారు. ఆయా పాఠశాలలోని విద్యార్థుల సంఖ్య ఆధారంగా నిధులు జమ అవుతాయని పేర్కొన్నారు.
వరదకాలువకు మూడు వేల క్యూసెక్కుల నీటి విడుదల
జగిత్యాలఅగ్రికల్చర్: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి వరద కాలువకు గురువారం మూడు వేల క్యూసెక్కుల నీటిని వదిలారు. కాకతీయ మెయిన్ కెనాల్‌కు 3,200 క్యూసెక్కుల నుంచి 1,375 క్యూసెక్కులకు తగ్గించారు. వరద కా లువ నుంచి లింక్ ద్వారా కాకతీయ కాలువ రెండో జోన్ ఆయకట్టుకు నీటిని విడుదల చేస్తున్నట్లు ఎస్సారెస్పీ అధికారులు తెలిపారు. ప్ర స్తుతం ప్రాజెక్ట్‌లో 1081.70 అడుగులు.. నీటి నిల్వ సామర్థ్యం 49.753 టీఎంసీలుగా ఉంది.
జాతీయస్థాయిలో గుర్తింపు తేవాలి
సారంగాపూర్: బీర్‌పూర్ మండలకేంద్రంలోని ఆయుష్మాన్ ఆరోగ్యమందిర్‌కు జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చేలా సిబ్బంది పనిచేయాలని డెప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీనివాస్ అన్నారు. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ (సబ్‌సెంటర్) గురువారం తనిఖీ చేశారు. ఈ కేంద్రాన్ని జాతీయ నాణ్యత ప్రమాణాల బృందం ఫిబ్రవరిలో పరిశీలించనుందని, రోగులకు సేవలందించడంలో, రికార్డుల నిర్వాహణ, పరిశుభ్రత, సమయపాలనలో ఉత్తమంగా నిలవాలని సూచించారు. ఈ మేరకు జాతీయ స్థాయి నాణ్యతా బృందం గుర్తింపు ఇస్తుందని పేర్కొన్నారు. ఆయన వెంట వైద్యాధికారి రాధ, సిబ్బంది ఉన్నారు.
సీఐ నిరంజన్‌రెడ్డికి డీజీపీ జితేంద్ర అభినందనలు
మెట్‌పల్లి: ఇండియన్ పోలీస్ మెడల్‌కు ఎంపికై న మెట్‌పల్లి సీఐ నిరంజన్‌రెడ్డిని డీజీపీ జితేంద్ర లేఖ ద్వారా అభినందించారు. విధుల్లో చూపిన అంకితభావం, సమర్థతకు తగిన గుర్తింపు దక్కిందని, భవిష్యత్తులోనూ ఇలాగే నడుచుకోవాలని సూచిస్తూ డీజీపీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment