వాతావరణం
జిల్లాలో ఉదయం వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆకాశం మేఘావృతమై పలు చోట్ల చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. రాత్రి చలి ఎక్కువగా ఉంటుంది.
మహిళల భద్రతే షీ టీం లక్ష్యం
● ఎస్పీ కిరణ్ ఖరే
భూపాలపల్లి: మహిళలు, యువతులకు ఎలాంటి సమస్యలు ఉన్నా నిర్భయంగా పోలీసులను సంప్రదించవచ్చని, వారి భద్రత కోసమే షీ టీంలు పనిచేస్తున్నాయని ఎస్పీ కిరణ్‌ఖరే అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో షీ టీం వాల్‌పోస్టర్లను ఎస్పీ మంగళవారం ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మహిళలు, చిన్న పిల్లల రక్షణ విషయంలో జిల్లా పోలీసు శాఖ పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మహిళలు సామాజిక మాధ్యమాల విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. మహిళలు, విద్యార్థినులను వేధింపులకు గురిచేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈవ్‌టీజింగ్‌కు గురైతే షీ టీం వెంటనే స్పందిస్తుందని, ఎవరైనా ఇబ్బందులకు గురిచేస్తే షీ టీం నంబరు 87126 58162 కు కాల్ చేయాలని ఎస్పీ సూచించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌స్పెక్టర్ రమేష్, షీ టీం ఎస్సై ఫజల్‌ఖాన్, ఉమెన్ హెడ్ కానిస్టేబుల్ దేవేంద్ర, కానిస్టేబుళ్లు శిరీష, ఇర్ఫాన్ పాల్గొన్నారు.
దాడులు పనికిమాలిన చర్య
భూపాలపల్లి: వికారాబాద్ జిల్లా లగచర్లలో ఔషధ పరిశ్రమ ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన కలెక్టర్ ప్రతీక్ జైన్, ఇతర అధికారులపై దాడి చేయడం పనికిమాలిన చర్య అని కలెక్టరేట్ పరిపాలన అధికారి(ఏఓ) ఖాజా మొహినొద్దీన్ అన్నారు. దాడికి నిరసనగా మంగళవారం ఐడీఓసీ కార్యాలయం ఎదుట రెవెన్యూ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఏఓ మాట్లాడుతూ.. కలెక్టర్లు, అధికారులు.. ప్రభుత్వం అమలు చేయనున్న, చేస్తున్న పథకాల విధి విధానాలు, మార్గదర్శకాల మేరకు పనిచేసే ఉద్యోగులు మాత్రమేమని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసంబంధాల అధికారి శీలం శ్రీనివాస్, రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రామ్మోహన్, షఫీ, రజాక్, తహసీల్దార్ మురళి, ఈడీఎం శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment