పెండింగ్ పనులు పూర్తి చేయాలి
భూపాలపల్లి: జిల్లా కేంద్రంలో నిర్మాణంలో ఉన్న నూతన గ్రంథాలయ భవనం పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేసిన అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. బుధవారం గ్రంఽథాలయం పనులను కలెక్టర్ పరిశీలించి మాట్లాడారు. గ్రంథాలయ భవనానికి అవసరమైన విద్యుత్ కనెక్షన్ కోసం సింగరేణి అధికారులతో చర్చించి త్వరలోనే అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుత ప్రాంగణంలో ఉన్న సెల్ టవర్ పక్క నుంచి ప్రధాన గేటు ఏర్పాటు చేయడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, గ్రంఽథాలయ కార్యదర్శి శ్రీలత, తహసీల్దార్ శ్రీనివాసులు, ఏఈ మహేందర్, ఆర్ఐ రామస్వామి, సిబ్బంది చంద్రమౌళి, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
ఉన్నత చదువులు చదవాలి..
గణపురం: ప్రభుత్వం కల్పిస్తున్న మౌలిక వసతు లను సద్వినియోగం చేసుకొని ఉన్నత చదువులు చదవాలని కలెక్టర్ రాహుల్‌శర్మ అన్నారు. బుధవారం గణపురం మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్లో ని వంటగది, వంట సామగ్రి ఉందా లేదా అని ఎస్ ఓ లావణ్యను అడిగి తెలుసుకున్నారు. అయితే వస తి గృహంలో మరుగుదొడ్లు, స్నానపు గదులు పాతపడటంతో విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని, లో ఓల్టేజీ సమస్య, మిషన్ భగీరథ నీరు రావడం లేదని ఎస్ఓ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. తమ దృష్టికి వచ్చిన సమస్యలను సంబంధిత అధి కారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కేజీబీవీలను డీఈఓలు నిరంతరం తనిఖీ చేయాలని ఆదేశించారు. అనంతరం కుందూర్పల్లి ఎంపీపీఎస్‌ను తనిఖీ చేశారు. డీఈఓ రాజేందర్, తహసీల్ధార్ సత్యనారాయణ స్వామి, ఎంపీడీఓ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ రాహుల్‌శర్మ
Comments
Please login to add a commentAdd a comment