మోగిన ఎన్నికల నగారా..
వరంగల్ –ఖమ్మం–నల్లగొండ నియోజకవర్గ ఉపాధ్యాయ
ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రాలు, ఓటర్ల సంఖ్య...
జిల్లా మండలాలు పోలింగ్ పురుషులు సీ్త్రలు మొత్తం
కేంద్రాలు
సిద్దిపేట 04 04 120 43 163
జనగామ 12 12 556 365 921
హనుమకొండ 11 15 2884 2214 5098
వరంగల్ 13 13 1381 844 2225
మహబూబాబాద్ 18 16 1083 535 1618
భూపాలపల్లి 07 07 211 112 323
ములుగు 09 09 394 218 612
భద్రాద్రి 23 23 1038 941 1949
ఖమ్మం 21 24 2300 1655 3955
యాదాద్రి 17 17 595 326 921
సూర్యాపేట 23 23 1690 947 2637
నల్లగొండ 33 37 2688 1795 4483
మొత్తం 191 200 14,940 9,965 2,4905
ఉపాధ్యాయ ‘ఎమ్మెల్సీ’
షెడ్యూల్ విడుదల
● ఫిబ్రవరి 3న నోటిఫికేషన్..
అదేరోజు నుంచి 10 వరకు నామినేషన్లు
● 11న నామినేషన్ల పరిశీలన..
13న ఉప సంహరణ...
● 27న పోలింగ్... మార్చి 3న
ఓట్ల లెక్కింపు... ఫలితాలు
● ఇప్పటికే ప్రచారం మొదలెట్టిన
ఆశావహులు
సాక్షిప్రతినిధి, వరంగల్: ఎప్పుడెప్పుడాని ఎదురుచూస్తున్న వరంగల్–నల్లగొండ–ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికల నగారా మోగింది. ఈ మేరకు భారత ఎన్నికల కమిషన్ బుధవారం షెడ్యూల్ ప్రకటించింది. ఎమ్మెల్సీగా ఉన్న అలుగుబెల్లి నర్సిరెడ్డి పదవీకాలం మార్చి 29న ముగియనుంది. ఇప్పటికే ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పోలింగ్ కేంద్రాలు, ఓటర్ల జాబితాను సిద్ధం చేయగా.. ఎమ్మెల్సీ రేసులో ఉన్న ఆశావహులు ప్రచాం సాగిస్తున్నారు.
వచ్చే నెల 3న నోటిఫికేషన్...
అమల్లోకి ఎన్నికల కోడ్...
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం వచ్చే నెల 3న నోటిఫికేషన్ విడుదల కానుంది. అదే రోజు నుంచి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉండగా.. 10వ తేదీ వరకు గడువు ఉంటుంది. ఆ రోజు వరకు దాఖలైన నామినేషన్లను ఎన్నికల అధికారులు 11న పరిశీలించనుండగా, 13న
నామినేషన్ల ఉపసంహరణ తర్వాత బరిలో ఉన్న అభ్యర్థుల పేర్లను వెల్లడిస్తారు. నామినేషన్ల ఉపసంహరణ.. పోలింగ్‌కు సుమారు మధ్య సుమారు 14 రోజుల సమయం ఉండనుండగా, ఒక్కరోజు ముందే ప్రచారాన్ని ముగించాల్సి ఉంటుంది. ఈ మేరకు అభ్యర్థులు ప్లాన్ చేసుకోవాల్సి ఉండగా.. 27న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. మార్చి 3న ఓట్లు లెక్కించి ఫలితాలను వెల్లడించనున్నట్లు ఎన్నికల కమిషన్ షెడ్యూల్లో పేర్కొంది. బుధవారం నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని వెల్లడించారు.
12 జిల్లాలు, 24,905 మంది ఓటర్లు...
వరంగల్ – నల్లగొండ – ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా 12 జిల్లాలు, 191 మండలాలకు చెందిన 24,905 మంది ఉపాధ్యాయులు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. ఇందుకోసం 200 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు ఇదివరకే ప్రకటించారు. ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ కోసం అధికార యంత్రాంగం సర్వసన్నద్ధమైంది. ఈ నియోజకవర్గం నుంచి ప్రస్తుతం టీఎస్‌యూటీఎఫ్ నేత అలుగుబెల్లి నర్సిరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయనకు ముందు పూల రవీందర్, చుక్కారామయ్యలు ఎమ్మెల్సీలుగా ప్రాతినిధ్యం వహించారు. ఈసారి ఎన్ని కల్లో నర్సిరెడ్డి మరోసారి బరిలో నిలవనుండగా ఇండిపెండెంట్‌గా ‘కుడా’ మాజీ చైర్మన్ ఎస్.సుందర్రాజు, వివిధ ఉపాధ్యాయ సంఘాల నుంచి పులి సరోత్తమరెడ్డి, పింగిళి శ్రీపాల్‌రెడ్డి, పూల రవీందర్, గాల్‌రెడ్డి హర్షవర్ధన్‌రెడ్డి, సాయిరెడ్డి, కస్తూరి సాయిచరణ్‌తో పాటు పలువురు ప్రచారం మొదలెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment